Sports Awards 2020: క్రీడాకారులకు అత్యున్నత పురస్కరాల ప్రదానం
Sports Awards 2020: టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను నేడు కేంద్ర ప్రభుత్వం సత్కరించబోతోంది. క్రీడారంగంలో అత్యున్నత పురస్కరమైన రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డును అందుకోనున్నారు.
Sports Awards 2020: టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను నేడు కేంద్ర ప్రభుత్వం సత్కరించబోతోంది. క్రీడారంగంలో అత్యున్నత పురస్కరమైన రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డును అందుకోనున్నారు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు నమోదు చేసిన రోహిత్ శర్మ ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకి ఎంపిక అయ్యాడు. ఖేల్‌రత్న అవార్డుని ఇప్పటి వరకూ ముగ్గురు క్రికెటర్లు మాత్రమే అందుకున్నారు. మొదట సచిన్ టెండూల్కర్‌కి ఈ గౌరవం దక్కగా.. ఆ తర్వాత ధోనీ, విరాట్ కోహ్లీ. ఈరోజు రోహిత్ శర్మ ఆ జాబితాలోకి సగర్వంగా అడుగుపెట్టనున్నాడు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను క్రీడాకారులకు అందజేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తొలిసారి వర్చువల్‌గా ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. ఈ ఏడాది రాజీవ్ ఖేల్‌రత్నకి ఐదుగురు ఎంపికకాగా.. అర్జునకి 27 మంది.. మొత్తంగా 74 మంది అవార్డులకి ఎంపికయ్యారు.
రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకి ఎంపికైన వారి జాబితాలో రోహిత్ శర్మ (క్రికెట్), వినేశ్ పొగట్ (రెజ్లింగ్), రాణి రాంపాల్ (హాకీ), మనిక బాత్ర (టేబుల్ టెన్నిస్), మరియప్పన్ (పారా అథ్లెటిక్స్)లున్నారు. అలాగే.. అలాగే టెస్టుల్లో నిలకడగా రాణించిన ఇషాంత్ శర్మకి అర్జున అవార్డు దక్కబోతోంది. అర్జున అవార్డుకి ఎంపికైన క్రీడాకారుల జాబితాలో ఇషాంత్ శర్మ (క్రికెట్),అతాను దాస్ (ఆర్చరీ), ద్యుతీ చంద్ (అథ్లెట్), చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్), దీప్తి శర్మ (క్రికెట్),సందేశ్ (ఫుట్‌బాల్), అదితి అశోక్ (గోల్ఫ్), విశేష్ (బాస్కెట్ బాల్), సుబేదార్ కౌశిక్ (బాక్సింగ్), అక్షదీప్ సింగ్ (హాకీ), దీపిక (హాకీ), లోవ్లినా (బాక్సింగ్), శావంత్ అజయ్ (ఈక్వెస్ట్రైన్), సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి (బ్యాడ్మింటన్), దీపక్ (కబడ్డీ), సుందర్ (ఖోఖో), దత్తు బాబన్ (రోయింగ్), మనుబాకర్ (షూటింగ్), సౌరబ్ చౌదరి (షూటింగ్), మధురిక (టేబుల్ టెన్నిస్), దివిజ్ శరణ్ (టెన్నిస్), శివ కేశవన్ (వింటర్ స్పోర్ట్స్) , దివ్య (రెజ్లింగ్), రాహుల్ (రెజ్లింగ్), నారాయణ యాదవ్ (పారా స్మిమ్మింగ్), సందీప్ (అథ్లెట్), మనీశ్ (పారా షూటింగ్) లు ఉన్నారు.