భారత బౌలర్లు సౌతాఫ్రికా ను కోలుకోనివ్వడం లేదు. కచ్చితమైన బౌలింగ్ తో ఓ పక్క పరుగులను నిరోధిస్తూనే.. మరో పక్క వరుసగా వికెట్లను తీస్తున్నారు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న దశలో సౌతాఫ్రికా సారధి డుప్లిసిస్, డుసెన్ జోడీలను విడదీసిన చాహల్ బాటలో.. ఈసారి కులదీప్ నడిచాడు. కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్న డుమిని ( 3 ) ని ఎలిబీడబ్ల్యు గా వెనక్కి పంపాడు. 24ఓవర్లకి దక్షిణాఫ్రికా జట్టు 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులతో ఉంది. మిల్లర్(11), ఫెలూక్వాయే(5) ఒత్తిడితో పోరాడుతున్నారు.