Sourav Ganguly: సౌరవ్‌ గంగూలీ సర్జరీ విజయవంతం

సౌరవ్ గంగూలీకి జనవరి 27వ తేదీన మరోసారి గుండే పోటు వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2021-01-28 14:21 GMT

భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి జనవరి 27వ తేదీన మరోసారి గుండే పోటు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. కాగా.. యాంజియోప్లాస్టీ విజయవంతమైనట్లు గురువారం అపోలో ఆసుపత్రి యాజమాన్యం నిర్థారించింది. రక్తానాళాల్లో పూడికలు తొలగించేందుకు అదనంగా మరో రెండు స్టంట్లు వేసినట్లు అపోలో వైద్యులు వెల్లడించారు.

బుధవారం గంగూలీ ఆయన్ను హుటాహుటిన కొల్కాతాలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈనెల 3ద తేదీన గంగూలీకి గుండెపోటు రావడంతో ఆయన్ను అపోలోకు తరలించారు. గుండె కు దారితీసే రక్తనాళాల్లో పూడికలున్నట్లు గుర్తించిన వైద్యులు ఆయనకు యాంజియో ప్లాస్టీ చేశారు. రెండు రోజుల విశ్రాంతి అనంతరం గంగూలీ ఇంటికి వెళ్లారు. కానీ ఇవాళ మరోసారి అనూహ్యంగా గుండెనొప్పి రావడంతో మళ్లీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు గంగూలీ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.మరోసారి యాంజియో ప్లాస్టీ చేసే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.

కాగా జనవరి 2న గంగూలీకి గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరిన చికిత్స తీసుకున్నారు. అనంతరం జనవరి 7న డిశ్చార్జ్ అయ్యారు. స్వల్ప గుండెపోటుతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరిన గంగూలీకి వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి గుండేపోటు రావడంతో వైద్యులు గంగూలీ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.


Tags:    

Similar News