Shahid Afridi about MS Dhoni and Ricky Ponting : అత్యుత్తమ కెప్టెన్ ఎవరు..పాంటింగా, ధోనీయా.. అఫ్రిదీ ఏమన్నాడంటే?
టీమ్‌ఇండియా జట్టుకి ఎన్నో చిరస్మనీయామైన విజయాలను అందించాడు ఇండియాన్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ధోని కెప్టెన్సీలో
Shahid Afridi about MS Dhoni and Ricky Ponting : టీమ్‌ఇండియా జట్టుకి ఎన్నో చిరస్మనీయామైన విజయాలను అందించాడు ఇండియాన్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ధోని కెప్టెన్సీలో భారత జట్టు 2007 టీ20, 2011 వన్డే ప్రపంచ కప్ మరియు 2013 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. 2007 నుండి 2016 వరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మరియు 2008 నుండి 2014 వరకు టెస్ట్ క్రికెట్లో ధోని జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ జట్టును ముందుకు నడిపించాడు. ఇక ప్రపంచంలోని అన్ని ఐసిసి ట్రోఫీలను సాధించిపెట్టిన ఏకైక కెప్టెన్ ధోనినే కావడం విశేషం. ప్రపంచ క్రికెట్‌లో ఏ సారథికి సాధ్యంకాని ఘనతలను ధోనీ సాధించి పెట్టడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.
ఇక అటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీపాంటింగ్ కూడా ఆ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. కెప్టెన్ గా 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లలో జట్టును ముందుకు నడిపించడంలో కీలకపాత్రను పోషించాడు. అంతేకాకుండా టెస్టుల్లోనూ, వన్డేలలో ఆ జట్టును ప్రధమ స్థానంలో నిలిపాడు. అలా ఆస్ట్రేలియా క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సాధించాడు. అయితే ఈ ఇద్దరు కెప్టెన్ లలో అత్యుత్తమ కెప్టెన్ ఎవరు అని ఓ అభిమాని తాజాగా పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీని అడిగాడు. తాజాగా బుధవారం ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించగా అఫ్రిదీకి ఈ ప్రశ్న ఎదురైంది.
అయితే దీనిపైన స్పందించిన పాక్ మాజీ క్రికెటర్.. పాంటింగ్ కన్నా ధోనీయే అత్యుత్తమ కెప్టెన్ అంటూ చెప్పుకొచ్చాడు.. ధోని యువ క్రికెటర్లతో టీమ్‌ఇండియాను గొప్పగా రూపొందించాడని షాహిద్ అఫ్రిదీ వెల్లడించాడు. ఇక అభిమానులు కూడా ధోనినే బెస్ట్ కెప్టెన్ అంటూ అభిప్రాయపడ్డారు.
ధోని రీఎంట్రీ పైన ఆసక్తి :
గత ఏడాది వరల్డ్ కప్ నుంచి భారత్ సెమీఫైనల్ నిష్క్రమించినప్పటి నుంచి ధోని మళ్ళీ జట్టు తరుపున ఆడలేదు. గత ఏడాది కాలంగా క్రికెట్ నుండి విశ్రాంతి తీసుకున్న ధోని మళ్ళీ జట్టులోకి ఎప్పుడు వస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ధోనీ మార్చిలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. ఇక ఐపీఎల్ 13 సీజన్ సెప్టెంబర్ లో మొదలవుతుందని అధికార ప్రకటన రావడంతో ధోని రీఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు..