రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన షెఫాలీ వర్మ
భారత్ టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డు బద్ధలైంది.
భారత్ టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డు బద్ధలైంది. టిమిండియా క్రికెట్ జట్టు మహిళా ఓపెనర్ షెఫాలీ వర్మ రోహిత్ రికార్డును బ్రేక్ చేసింది. వెస్టిండీస్ టీ20సిరీస్‌లో భాగంగా జరిగిన మొదటి టీ20లో ఫాలీ వర్మ కేవలం 49 బంతుల్లో 73 పరుగులు సాధించి రికార్డు బ్రేక్ చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో చిన్న వయసులోనే అర్ధ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా షెఫాలీ వర్మ గుర్తింపు పొందారు. 15 సంవత్సరాల 285 రోజుల వయసులోనే షెఫాలీ వర్మ అంతర్జాతీయ టీ20ల్లో అడుగుపెట్టారు. అంతేకాకుండా విండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశారు.
అంతకముందు ఈ రికార్డు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. రోహిత్ శర్మ 20 ఏళ్ల 143 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించారు. తాజాగా ఈ రికార్డును ఓపెనర్ షెఫాలీ వర్మ బద్దలు కొట్టారు. టీ20ల్లో పిన్న వయసులో అర్థ శతకం సాధించిన రికార్డు యూఏఈకి చెందిన ఎగోడాజ్ పేరిట ఉంది. సచిన్ రికార్డును కూడా షెఫాలీ వర్మ బద్దలు కొట్టింది. 16 ఏళ్ల 214 రోజులు వయసులో సచిన్ టెస్టు క్రికెట్ లో హాఫ్ సెంచరీ సాధించారు. అతి పిన్నవయసు హాఫ్ సెంచరీ సాధించి అటూ సచిన్, ఇటు రోహిత్ రికార్డును షెఫాలీ వర్మ బద్దలు కొట్టారు
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో మంధాన, షెఫాలీ తొలి వికెట్‌కు 143 పరుగు కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మంధాన(67) 46 బంతుల్లో 11 ఫోర్లు సాధించింది. షెఫాలీ వర్మ (73) ఆరు ఫోర్లు ఆరు సిక్సులుతో దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళా జట్టు 20 ఓవర్లతో 185 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ మహిళా జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 101 పరుగులకే పరిమితమైంది. భారత్ జట్టు 84పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు జరిగిన మూడు వన్డేలా సిరీస్ ను 2-1తో భారత్ కైవసం చేసుకున్నవిషయం తెలిసిందే.