SA vs AFG: తొలిసారి ఫైనల్‌కు సఫారీలు.. ఆఫ్ఘాన్లను ఆటాడుకున్న దక్షిణాఫ్రికా బౌలర్లు

SA vs AFG: ఐసీసీ టోర్నీలో తొలిసారిగా దక్షిణాఫ్రికా పైనల్ కు చేరింది. చారిత్రాత్మక రీతిలో టీ-20 వరల్డ్ కప్ 2024లో సెమీ ఫైనల్ కు చేరిన అప్ఘనిస్తాన్ ను సఫారీలు మట్టికరిపించారు.

Update: 2024-06-27 04:29 GMT

SA vs AFG: తొలిసారి ఫైనల్‌కు సఫారీలు.. ఆఫ్ఘాన్లను ఆటాడుకున్న దక్షిణాఫ్రికా బౌలర్లు

SA vs AFG: ఐసీసీ టోర్నీలో తొలిసారిగా దక్షిణాఫ్రికా పైనల్ కు చేరింది. చారిత్రాత్మక రీతిలో టీ-20 వరల్డ్ కప్ 2024లో సెమీ ఫైనల్ కు చేరిన అప్ఘనిస్తాన్ ను సఫారీలు మట్టికరిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి వార్ వన్ సైడ్ అన్నట్టు సాగింది. అప్ఘనిస్తాన్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్తాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకే చాపచుట్టేశారు. కీలక మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగారు. పేసర్ మార్కో యన్సెన్, స్పిన్నర్ షంషీ చెరో మూడు వికెట్లు తీయగా పేసర్లు కగిసో రబడ, అన్రిచ్ నోర్టే చెరో రెండు వికెట్లు పడకొట్టారు.

అప్ఘనిస్తాన్ బ్యాటర్లు కేవలం ఒక్కరు మాత్రమే రెండెంకల స్కోర్ చేశారు. పది పరుగులు చేసిన అజ్మతుల్లా అమర్జాన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా 8.5 ఓవర్లలో ఆడుతూ పాడుతూ సునాయస విజయం పొందింది. తొలిసారిగా టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు సౌత్‌ఆఫ్రికా అడుగుపెట్టింది. 

Tags:    

Similar News