Pitch Criticism: పిచ్ లో తప్పేం లేదు - రోహిత్‌ శర్మ

Pitch Criticism: భారత్, ఇంగ్లాండ్‌ ల మధ్య జరిగిన 3వ‌ టెస్టులో పిచ్‌ పై అనవసర విమర్శలొద్దని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.

Update: 2021-02-26 12:30 GMT

రోహిత్ శర్మ (ఫోటో ట్విట్టర్ )

Pitch Criticism: భారత్, ఇంగ్లాండ్‌ ల మధ్య జరిగిన డే/నైట్‌ టెస్టులో పిచ్‌ పై అనవసర విమర్శలొద్దని టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) పేర్కొన్నాడు. డైరెక్టుగా వికెట్లపై వేసిన బాల్స్‌కే చాలా మంది బ్యాట్స్‌మెన్ వికెట్ సమర్పించుకున్నారని అన్నాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ మొతెేరా పిచ్ పై వస్తున్న విమర్శలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లే కాదు టీంఇండియా బ్యాట్స్‌మెన్‌ కూడా ఫెయిల్ అయ్యామన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో తామూ సరిగ్గా ఆడలేకపోయామని స్పష్టం చేశాడు. పిచ్‌ ను వేలెత్తి చూపొద్దని, పిచ్ పై దెయ్యాలేం లేవన్నాడు. బ్యాట్స్‌మెన్ పిచ్ పై ఒక్కసారి కుదురుకుంటే పరుగులు చేయడం కష్టంమేమి కాదని వివరించాడు.

అయితే, స్పిన్‌కు అనుకూలించే ఇలాంటి పిచ్‌ లపై ఆడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని రోహిత్‌ అభిప్రాయపడ్డాడు. పరుగులు చేయాలంటే చాలా ఓపికగా ఆడాలి. చెత్త బాల్స్ ను వేటాడి పరుగులు సాధించేలా ప్రయత్నించాలి. ప్రతీ బంతిని డిఫెన్స్‌ చేయడం కూడా సరికాదు. అలా చేస్తే కొన్నిసార్లు బంతి అనూహ్యంగా వికెట్ల మీదకు వస్తుంది. పరిస్థితులను బట్టి షాట్‌లు ఆడేందుకు వెనుకాడొద్దన్నాడు. టీం ఇండియాకు అనుకూలంగా పిచ్ సిద్ధం చేశారనడం సమంజసం కాదు. ఎందుకంటే, భారత బ్యాట్స్‌మెన్స్ కూడా ఆలౌట్ అయ్యారు కదా అని విమర్శకులకు బదులిచ్చాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో‌ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీమ్‌ఇండియా 10 వికెట్ల తేడాతో గెలుపొంది టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు మరింత చేరువైంది.

Tags:    

Similar News