వరల్డ్ కప్ టోర్నీ లో భారత బ్యాట్స్ మెన్ రెచ్చిపోతున్నారు. రోహిత్ శర్మ పాకిస్థాన్ పై అర్థ శతకాన్ని సాధించాడు. 34 బంతుల్లో ఒక సిక్స్ ఐదు బౌండరీలతో ఈ అర్థశతాకాన్ని సాధించాడు. మరో పక్క కెఎల్ రాహుల్ కూడా కుదురుకున్నాడు. తన బ్యాట్ కు పని చెబుతున్నాడు. అమిర్ బౌలింగ్ స్పెల్ ముగిసిన తరువాత భారత ఓపెనర్లు రెచ్చిపోతున్నారు. అద్భుతమైన క్రికెట్ ప్రదర్శిస్తున్నారు. కొద్దిగా సింగిల్స్ విషయంలో తడబాటుకు గురైనా చక్కని సమన్వయంతో టీమిండియాకు కావలసిన పురుగుల్ని సాధించడానికి ఇద్దరూ అద్భుతంగా ఆడుతున్నారు. మొత్తమ్మీద పదిహేను ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది.