Rohit Sharma: రోహిత్ శర్మ "గోల్డెన్ బ్యాట్"కి రెండేళ్ళు
Rohit Sharma: భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 2019 ప్రపంచ..
Rohit Sharma: భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 2019 ప్రపంచ వన్డే క్రికెట్ లో రికార్డు పరుగులు సాధించి గోల్డెన్ బ్యాట్ అందుకొని నేటితో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. రెండేళ్ళ క్రితం ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ ఐదు సెంచరీలు సాధించడంతో పాటు రోహిత్ ఆ సిరీస్ లో 648 పరుగులు సాధించాడు. ఈ ప్రపంచ కప్ లో తన అద్భుత ప్రదర్శనతో భారత జట్టు తరపున గోల్డెన్ బ్యాట్ అందుకున్న రోహిత్ శర్మ ఇప్పటికే తన మెరుగైన ప్రదర్శనతో భారత జట్టుకి విజయాలను అందిస్తున్నాడు. ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు నుండి ఇప్పటి వరకు గోల్డెన్ బ్యాట్ అందుకున్న భారత జట్టులో రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ లెజెండరీ ఆటగాళ్ళ తర్వాత మూడో స్థానంలో రోహిత్ నిలిచాడు.
వన్డే, టీ20 లో ఓపెనర్ గా తనదైన ముద్ర వేసుకున్న రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంత సమయం ప్రత్యర్ధ జట్టు బౌలర్లకి ఫోర్లు సిక్సర్ల తో చెమటలు పట్టిస్తాడు. గతంలో తన ఫిట్ నెస్ సమస్యతో కొంత కాలం భారత జట్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ తర్వాత కుదురుకొని అటు ప్రపంచ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ తన జట్టుకు విజయాలను అందిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది జరగనున్న టీ 20 ప్రపంచ కప్ లో మరోసారి తన సత్తా చాటి భారత్ కి ప్రపంచ కప్ ని అందించడానికి రోహిత్ శర్మతో భారత జట్టు సభ్యులు కూడా తహతహలాడుతున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో జరగబోయే టోర్నీకి విశ్రాంతిలో ఉన్న రోహిత్ త్వరలో భారత్ తరపున జరగబోయే మ్యాచ్ లకు మైదానంలో అడుగుపెట్టి క్రీడా అభిమానులను అలరించనున్నాడు.