Road Safety World Series: ఆఖర్లో అదరగొట్టిన పఠాన్..భారత లెజెండ్స్ ఓటమి

Road Safety World Series:

Update: 2021-03-10 03:06 GMT

పఠాన్

Road Safety World Series: రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ (2020-2021)లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న టోర్నీలో మాజీ క్రికెట్లర్లు అదరగొడుతున్నారు. మంగళవారం భారత్ లెజెండ్స్- ఇంగ్లాండ్ లెజెండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ 7 వికెట్ల కోల్పోయి 188 పరుగులు చేసింది. లక్షచేధనలో టీమిండియా నిర్ణీత ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులకే పరిమితం అయింది. దీంతో ఇంగ్లాండ్ లెజెండ్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(65,35 బంతుల్లో 4ఫోర్లు,3 సిక్సర్లు) పరుగులు చేసి తనలో ఇంకా పస తగ్గలేదని మరోసారి నిరూపించాడు.  

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ లెజెండ్స్ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ రెచ్చిపోయాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని కెవిన్‌ పీటర్సన్‌ సాధించాడు. బరిలో ఉన్నంత వరకు పీటర్సన్‌ భారత బౌలర్లే లక్ష్యంగా చెలరేగిపోయాడు. దీంతో ఇంగ్లాండ్ 200పైచిలుకు స్కోరు చేస్తుందని అంతా భావించారు. సెంచరీ దిశగా సాగుతున్న పీటర్సన్ ను పఠాన్ నిలువరించాడు. పీటర్సన్ 75 వ్యక్తిగత స్కోర వద్ద ఇర్ఫాన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ ఓజా చేతికి దొరికిపోయాడు.

అనంతరం వచ్చిన బ్యాట్స్ మెన్ డి మాడి 27బంతుల్లో 29 రన్స్ చేశాడు. సి స్కోఫీల్డ్, జి హామిల్టన్ చెరో 15 పరుగులు చేశాడు. పీటర్సన్ ఔట్ తర్వాత భారత బౌలర్లు మ్యాచ్ పై పట్టు సాధించారు. ఇంగ్లాండ్ లెజెండ్స్ కు భారీ స్కోరు సాధించే అవకాశం ఇవ్వలేదు. ఇండియా బౌలర్లలో యూసుఫ్‌ పఠాన్‌ మూడు వికెట్లు తీశాడు. భారత మాజీ పేసర్ మునాఫ్‌ పటేల్‌, మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా లెజెండ్స్ ‌తడబడింది. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (6), సచిన్ టెండూల్కర్ (9) పూర్తిగా విఫలమయ్యారు. గత మ్యాచ్‌లో బంగ్లాపై విజృంభించిన మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. మూడో బ్యాట్స్ మెన్ గా వచ్చిన మహ్మద్ కైఫ్ (1), యువరాజ్ సింగ్ (20), ఎస్ బద్రీనాథ్ (8) కూడా త్వరగానే పెవిలియన్ చేరారు. ఇండియా లెజెండ్స్‌ 8.2 ఓవర్లలో 56/ 5 వికెట్లు కోల్పోయి చేసి పీలల్లోతు కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పఠాన్ బ్రదర్స్ రెచ్చిపోయారు. 2009లో శ్రీలంకపై మ్యాచ్ ను మరోసారి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మూడు ఫోర్లతో ఊపుమీదున్నయూసఫ్ పఠాన్ ట్రేడ్ విల్ కు పెవిలియన్ చేర్చాడు. దీంతో ఇండియా ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుదుపుకు గురైంది. ఓజాతో జతకట్టిన ఇర్ఫాన్ పఠాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పఠాన్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 34 బంతుల్లో 61పరగులు చెలరేగితే.. చివర్లో గోని 16 బంతుల్లో 35 పరుగులతో అదరగొట్టాడు. ఇద్దరూ భారత్ ను విజయం వైపు నడిపించాడరు. ఇరువురు కలిసి 8వ వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఆఖరి ఓవర్లో 19 పరుగులు అవసరం ఉండగా ఇంగ్లాండ్ లెజెండ్స్ బౌలర్ సైడ్ బాటమ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ల్ 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో భారత్ 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో పనేసర్ మూడు వికెట్లు పడగొట్గగా.. హోగార్డ్ ఒకటి, బాటమ్ చెరో ఓ వికెట్ దక్కించుకున్నారు. ఇండియా లెజెండ్స్ తన తదుపరి మ్యాచ్ మార్చి 13న సౌతాఫ్రికా లెజెండ్స్ లో తలపడనుంది.

Tags:    

Similar News