Rewind-2020 Sports : ఈ ఏడాది రివైండ్‌ చేసుకుంటే మహమ్మారి.. అంతా నిరాశే

గత సంవత్సరం వరుస విజయాలతో 2020 ఏడాదిలోకి అడుగు పెట్టింది భారత్ క్రీకెట్ జట్టు.

Update: 2020-12-27 14:03 GMT

ఆటలను దూరం చేసింది. ఆనందాన్నీ దూరం చేసింది. ఆ నందాన్ని పంచే ఆటగాళ్ళనూ దూరం చేసింది. కొంతమంది చేత ఆటలకు గుడ్ బై కొట్టించింది. ఎన్నింటినో వాయిదా వేయించింది. ఇదీ 2020 ఘనత. చూద్దాం.. రివైండ్-2020.

గత సంవత్సరం వరుస విజయాలతో 2020 ఏడాదిలోకి అడుగు పెట్టింది భారత్ క్రీకెట్ జట్టు. అదే రేటించిన ఉత్పాహంతో న్యూజిలాండ్ జట్టుపై టీ20 సిరీస్ ను 3-5తో గెలిచింది. ఆ తర్వాత జరిగిన 5 వన్డేలు ఓటములతో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయింది. టెస్టు సిరీస్ ను కోల్పోయింది. ఆ తర్వాత ఆటల మీదే కాదు.. అన్నింటి మీద కరోనా ప్రభావం తీవంగా పడింది. ఈ ఏడాది జరగాల్సిన అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ కరోనా కారణంగా రద్దయ్యాయి. కొన్ని నెలల తర్వాత కొన్ని ఈవెంట్స్ జరిగినా పెద్దగా అభిమానుల ఆదరణను పొందలేక పోయాయి. ఈ కేలండర్ ఇయర్ మొత్తాన్ని కరోనా దెబ్బతీసింది.

మార్చిలో జరగాల్సిన IPL కరోనా కారణంగా వాయిదా పడుతూ.. చివరికీ సెప్టెంబర్ లో నిర్వహించారు. పైగా భారత్ లో జరగాల్సిన ఈ పోటీలను యునైటెడ్ అరబె ఎమిరేట్స్ లోని మూడు వేదికలపై నిర్వహించారు. మొత్తం ఎనిమిది టీమ్ లు పాల్గొన్న ఈ పోటీలలో ముంబై దుమ్ము రేపింది. ఐదోసారి ట్రోఫీ సాధించింది.

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ క్రికెట్ జట్టు టీ-20 సిరీస్ ను కైవసం చేసుకున్నా.. వన్డేలలో ఓటమి పాలైంది. ఇక టెస్ట్ చరిత్రలో భారత్ ఓ ఇన్నింగ్స్ లో అత్యల్ప స్కోర్ చేసి .. చెత్త రికార్డును నెలకొల్పింది. దీనిపై అనేక విమర్శలు కూడా తలెత్తాయి. అంతర్జాతీయ క్రికెట్ కు ఈ ఏడాది ముగ్గురు స్టార్ ప్లేయర్స్ గుడ్ బై చెప్పారు. అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరైన ఇర్ఫాన్ పఠాన్ తో పాటు అత్యుత్తమ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనా క్రికెట్ నుంచి నిష్క్రమించారు. 16 సంవత్సరాల క్రికెట్ కెరీర్ లో ధోనీ చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. ధోనీ నిష్క్రమణ క్రికెట్ క్రీడాభిమానులకు తీరని నిరాశ కలిగించింది.

2020 ఎన్నో పాఠాలు .. గుణపాఠాలు నేర్పింది. విషాదాన్ని నింపింది. బాధల గాయాలను రేపింది. ఎంతో మందిని పొట్టనబెట్టుకుంది. ప్రముఖుల మరణాలు ఆయా రంగాలను బాగా కుదిపేశాయి. ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనా.. బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబీ బ్రయింట్ లాంటి ఉద్దండ ఆటగాళ్ళను మింగేసింది. క్రీడారంగంలో పెను విషాదాన్ని మిగిల్చింది. అభిమానుల కంట కన్నీరు పెట్టించింది. 2020 వస్తూ.. వస్తూ ..అశాంతిని తెచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా భయాన్ని సృష్టించింది. ఆ.. వాతావరణం ఇంకా తొలగిపోక ముందే కొత్త ఏడాది వచ్చేస్తోంది. చూద్దాం.. 2021 ఎలా ఉండబోతోందో. మళ్ళీ మరో అంశంతో కలుద్దాం. స్టే వితజ్.

Tags:    

Similar News