తడబడ్డ బెంగుళూరు .. ముంబయి టార్గెట్ 165 పరుగులు
ఐపీఎల్ 2020లో భాగంగా ఈ రోజు ముంబై, బెంగుళూరు జట్ల మధ్య జరుగుతున్న ఆసక్తికర పోరులో బెంగుళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లకి గాను 164 పరుగులు చేసింది. ముందుగా టాస్ గెలిచిన ముంబై జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2020లో భాగంగా ఈ రోజు ముంబై, బెంగుళూరు జట్ల మధ్య జరుగుతున్న ఆసక్తికర పోరులో బెంగుళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లకి గాను 164 పరుగులు చేసింది. ముందుగా టాస్ గెలిచిన ముంబై జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీనితో బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు జట్టుకు ఓపెనర్లు పడిక్కల్, ఫిలిప్ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరు ముంబై బౌలర్లను ఎదురుకుంటూ బౌండరీలను బాదుతూ స్కోర్ బోర్డు వేగం పెంచారు. ఇద్దరు కలిసి మొదటి వికెట్ కి గాను 73 పరుగులు చేశాడు.
ఈ క్రమంలోనే రాహుల్ చాహర్ వేసిన అయిదో బంతిని షాట్‌కు యత్నించి ఫిలిప్ స్టంపౌటయ్యాడు దీనితో బెంగుళూరు జట్టు మొదటి వికెట్ ని కోల్పోయింది. ఫిలిప్ అవుట్ అయినప్పటికీ పడిక్కల్ వేగంగా ఆడాడు.. కేవలం 30 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఇక అటు క్రీజ్ లోకి వచ్చిన కోహ్లి (9) నిరాశపరిచాడు.. బుమ్రా వేసిన రెండో బంతిని షాట్‌కు యత్నించిన కోహ్లీ తివారి చేతికి చిక్కాడు. లీగ్‌లో బుమ్రాకి ఇది 100వ వికెట్ కావడం విశేషం...
ఇక ఆ తర్వాత వచ్చిన డివిలియర్స్ (15) కూడా వెనుదిరిగాడు. ఒక పక్కా వికెట్లు పడుతున్న మరోపక్కా పడిక్కల్ అద్భుతమైన షాట్లతో అలరిస్తూ స్కోర్ బోర్డు వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలో బుమ్రా వేసిన 17 ఓవర్లలలో బెంగుళూరు జట్టుకి పెద్ద షాక్ తగిలింది. బుమ్రా వేసిన రెండో బంతికి దూబె (2), అయిదో బంతికి పడిక్కల్ (74) అవుట్ అయ్యారు. దీనితో బెంగుళూరు జట్టు 134 పరుగులకే అయిదు వికెట్లను కోల్పోయింది.
ఆ వెంటనే మోరిస్ (4) కూడా అవుట్ అవ్వడంతో బెంగుళూరు జట్టుకు భారీ స్కోర్ కష్టమైంది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లకి గాను 164 పరుగులు చేసింది. ఇక ఇప్పటివరకు ఈ రెండు జట్లు 11 మ్యాచ్‌లు ఆడగా చెరో ఏడు విజయాలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.