ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఇంకా బోణీ కొట్టకపోవడంతో గెలుపుపై దృష్టి సారించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కేన్ విలియమ్సన్ చేరాడు. గత మ్యాచ్‌లో విలియమ‍్సన్ ఆడకపోవడంతో భువనేశ్వర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా ఇదే తొలి మ్యాచ్ కానుండడంతో అభిమానులు ఆసక్తితో వచ్చారు. టిక్కెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడవడంతో స్టేడియం ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయింది.
సన్‌రైజర్స్ జట్టు: కేన్ విలియమ్సన్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, విజయ్ శంకర్, యూసఫ్ పఠాన్, మనీష్ పాండే, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, షహబాజ్ నదీమ్, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్
రాజస్తాన్ జట్టు: అజింక్యా రహానే(కెప్టెన్), జోస్ బట్లర్, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, రాహుల్ త్రిపాఠీ, కృష్ణప్ప గౌతమ్, జోఫ్రా ఆర‍్చర్, ఉనాద్కత్, శ్రేయస్ గోపాల్, ధావల్ కులకర్ణి