Tokyo Olympics: కాసేపట్లో ఒలింపిక్స్‌ మహిళల బ్యాడ్మింటన్ కాంస్య పోరు

Tokyo Olympics: చైనా షట్లర్‌ హీ బింగ్ జియావోతో తలపడనున్న పీవీ సింధు * రెండో ఒలింపిక్‌ మెడల్‌పై గురిపెట్టిన పీవీ సింధు

Update: 2021-08-01 10:40 GMT

పీవీ సింధు (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympics: స్వర్ణ పతక అవకాశాలను కోల్పోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్య పతకంపై గురి పెట్టింది. కాసేపట్లో జరగనున్న ఒలింపిక్స్‌ మహిళల బ్యాడ్మింటన్ కాంస్య పోరులో.. చైనా షట్లర్‌ హీ బింగ్ జియావోతో తలపడనుంది పీవీ సింధు. ప్రస్తుతం సింధు 7వ ర్యాంక్‌లో, బింగ్జియావో 9వ ర్యాంక్‌లో ఉన్నారు.

ఈ మ్యాచ్‌ గెలిస్తే రెండు ఒలింపిక్‌ పతకాలు సాధించిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించనుంది సింధు. ఇక సింధుతో తలపడుతోన్న చైనా షట్లర్ హీ బింగ్ జియావో.. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో పతకం సాధించలేదు. దాంతో తొలి పతకాన్ని సాధించాలనే కసితో ఉంది హీ బింగ్. గతంలో 15 సార్లు సింధు, హీ బింగ్‌ జియావో తలపడ్డారు. తొమ్మిది సార్లు హీ బింగ్‌ జియావో గెలవగా.. ఆరుసార్లు సింధు విజయం సాధించింది. ఈ 15 మ్యాచుల్లో సింధును నాలుగుసార్లు వరుసగా ఓడించింది బింగ్జియావో. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌ కూడా పీవీ సింధుకు సవాల్‌ మారింది.

అయితే గ‌తంలో సింధు బ్యాక్‌హ్యాండ్‌పై ఎక్కువ‌గా ఆడేలా చేసి బింగ్జియావో పైచేయి సాధించింది. ఈ బ‌ల‌హీన‌త‌పై దృష్టిసారించిత సింధు దీనిని అధిగ‌మించింది. ఈ మ‌ధ్య త‌న నెట్‌ప్లేను కూడా మెరుగుపరుచుకుంది. దీంతో సింధు ఇవాళ బింగ్జియావోపై పైచేయి సాధించే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News