PV Sindhu: సయ్యద్ మోదీ టోర్నీలో పీవీ సింధు విజయం
PV Sindhu: భారత స్టార్ షెట్లర్ పీవీ సింధూ రెండేళ్ల నిరీక్షణ ఫలించింది.
PV Sindhu: భారత స్టార్ షెట్లర్ పీవీ సింధూ రెండేళ్ల నిరీక్షణ ఫలించింది. సింధూ పతకాల వేటలో మరో మణిహారం చేరింది. సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ ఇంటర్నేషనల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. లక్నో వేదికగా జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సూపర్ 300 టోర్నీలో విజయం సాధించి రెండోసారి టైటిల్‌ను అందుకుంది.
సయ్యద్ మోదీ టోర్నీలో ఫైనల్‌కు చేరిన సింధూ టైటిల్ పోరులో భారత్‌కే చెందిన మాళవికా బన్సోద్‌ను వరుస సెట్లలో ఓడించి, టైటిల్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ ఆసాంతం దూకుడుగా ఆడిన సింధూ మొదటి సెట్‌ను 21-13, రెండో సెట్‌ను 21-16తో గెలుపొందింది. కేవలం 23 నిమిషాల్లోనే సింధూ ఈ పోరును ముగించడం విశేషం.
సిందూకు ఇది రెండో సయ్యద్ మోదీ ట్రోఫీ. మొదట 2017లో ఈ టైటిల్‌ను చేజిక్కించుకున్నది. 2019 గ్లాస్గోలో జరిగిన ప్రపంచ చాపింయన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తరువాత మరే అంతర్జాతీయ పోరులోనూ సింధూకు టైటిల్ దక్కలేదు. రెండేళ్ల తరువాత సింధూకు ఇదే మొదటి టైటిల్ కావడం విశేషం.
రెండేళ్ల తరువాత సింధూ అంతర్జాతీయ టైటిల్ సాధించడంపై తండ్రి పీవీ రమణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో అడిన క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. సయ్యద్ మోదీ ట్రోపీలో అంతర్జాతీయ క్రీడాకారులతో ఆడడం వారికి కలిసొస్తుందని రమణ అన్నారు.