Pranab Mukherjee: మాజీ రాష్ట్రపతికి క్రీడా లోకం సంతాపం
Pranab Mukherjee: ఓ శకం ముగిసింది.. అపర చాణిక్యుడు.. రాజనీతిజ్ఞుడు .. రాజకీయాల్లో ఎత్తు పల్లాలను ఎరిగిన వాడు. ఉన్నత పదవులను అధిరోహించిన వాడు. ప్రజల ఆకాంక్షలను ఎరిగిన వాడు..
Pranab Mukherjee: ఓ శకం ముగిసింది.. అపర చాణిక్యుడు.. రాజనీతిజ్ఞుడు .. రాజకీయాల్లో ఎత్తు పల్లాలను ఎరిగిన వాడు. ఉన్నత పదవులను అధిరోహించిన వాడు. ప్రజల ఆకాంక్షలను ఎరిగిన వాడు.. సకల జనుల ఆరాద్యుడు రాజకీయ భీష్ముడు అతడే ప్రణబ్ ముఖర్జీ. ఆయన సోమవారం ఆర్మీ ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతిగా ఆయన అనేక కీలక ఘట్టాలకు సాక్షిభూతంగా నిలిచారు. ఆయన ఆకస్మిక మరణానికి యావద్దేశం నివాళులర్పిస్తోంది. వివిధ రంగాలకు చెందిన వారితో పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా సంతాపం తెలియజేశారు.
దశాబ్దాలపాటు అకుంఠిత దీక్షతో ప్రణబ్ ముఖర్జీ దేశానికి సేవలందించారు. ఆయన మృతి విచారకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. - సచిన్ టెండూల్కర్
దేశం ఒక అద్భుతమైన నాయకుడిని కోల్పోయింది. ముఖర్జీ లేరన్న వార్త విన్నందుకు బాధగా ఉంది. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం - కోహ్లీ .
ప్రణబ్ ముఖర్జీ మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మక సద్గతి కలగాలని ప్రార్థిస్తున్నాను- వీవీఎస్ లక్ష్మణ్
ప్రణబ్ అస్తమయంతో ఒక శకం ముగిసింది- బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల
భారత రాజకీయాల్లో ప్రణబ్ దిగ్గజ నేత, బహుముఖ ప్రజ్ఞాశాలి- బాక్సర్ విజేందర్ సింగ్
'రెస్ట్ ఇన్ పీస్.. ప్రణబ్ ముఖర్జీ జీ. మీరు దేశానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆయన ప్రియమైనవారికి నా సంతాపంస - స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్
'ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినందుకు హృదయపూర్వక సంతాపం. అతడి ఆత్మకు శాంతి కలుగుగాక. - అనిల్ కుంబ్లే
ఆయన మాకు మార్గదర్శి. దేశానికి ఆయన చేసిన సేవల చిరస్మరణీయం. - క్రీడా మంత్రి కిరణ్ రిజిజు
ప్రణబ్ జీ మృతికి నా హృదయపూర్వక నివాళి ప్రకటిస్తున్నా. - వీరేంద్ర సెహ్వాగ్
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరనే విషయం విచారం కలిగించింది. - సైనా నెహ్వాల్