Pitch Criticism: స్పిన్నర్లు గెలిస్తే.. పిచ్ పై విమర్శలా? ప్రగ్యాన్‌ ఓజా

Pitch Criticism: ఒక ఇన్నింగ్స్‌లో బాట్స్‌మెన్‌ 300 రన్స్ సాధిస్తే అందరూ పొగుడుతారు.. వ్యతిరేకంగా ఎవరూ మాట్లడరు అని ఓజా అన్నాడు.

Update: 2021-02-26 11:21 GMT

Pragyan Ojha (ఫోటో హన్స్ ఇండియా )

Pink Ball Test: "క్రికెట్ లో బ్యాట్స్‌మెన్ పరుగుల్లో రికార్డులు క్రియోట్ చేస్తే..అందరూ పొగుడుతారు. కానీ, స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీసిన మ్యాచ్‌ల్లో మాత్రం పిచ్ పై విమర్శలు కురిపిస్తా" రని వెటరన్ క్రికెటర్ ప్రగ్యాన్‌ ఓజా (Pragyan Ojha) మాజీలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ పైవిదంగా స్పందించాడు. భారత్, ఇంగ్లాండ్‌ టీంల మధ్య మొతేరా స్టేడియంలో జరిగిన 3వ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే పూర్తయింది. దీంతో మొతేరా పిచ్‌పై అనేక విమర్శలు వస్తున్నాయి. టెస్టు మ్యాచ్‌కు ఇలాంటి పిచ్‌ లు ఉండకూడదని పలువురు మాజీలు సైతం వ్యతిరేకిస్తున్నారు. స్పిన్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై రెండు జట్ల బ్యాట్స్‌మెన్‌ పరుగులు రాబట్టలేక ఇబ్బందులు పడ్డారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 30 వికెట్లు నేలకూలగా, అందులో 28 వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి. దీంతో ఇక్కడ స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారా ? లేక నిజంగానే బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారా? అనే ప్రశ్నలు లేవనెత్తారు క్రికెట్ ప్రముఖులు. అయితే, వీటికి గట్టిగానే బదులిచ్చాడు ఓజా.

ఇలాంటి విమర్శలు క్రికెట్ ప్రముఖులు లేవనెత్తడం చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఓ బాట్స్‌మెన్‌ ఒక ఇన్నింగ్స్‌లో 400 లేదా 300 రన్స్ సాధిస్తే అందరూ పొగుడుతారు.. వ్యతిరేకంగా ఎవరూ మాట్లడరు అని ఓజా అన్నాడు. ఇది స్పోర్టివ్ వికెట్‌. బ్యాట్స్‌మెన్స్ బాగా ఆడాల్సింది. కానీ, స్పిన్నర్లు బాగా ఆడినప్పుడు ఇలా ఎందుకు అడుగుతారు? బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోర్‌ సాధిస్తే వరల్డ్ రికార్డు(World Record) సాధించాడని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తారు. పేసర్లు ఎక్కువ వికెట్లు తీసినపుడు.. బాల్‌ను బాగా స్వింగ్‌ చేశాడని కొనియాడతారు. అలాంటిది స్పిన్నర్ల విషయంలోనే పిచ్ పై విమర్శలు కురిపిస్తారని ఓజా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇకనుంచైనా స్పిన్నర్లను తక్కువగా చూడడం మానుకోవాలని కోరాడు. కాగా, మొతేరా మ్యాచ్‌లో భారత బౌలర్లు అక్షర్‌ పటేల్ మొత్తం 11 వికెట్లు పడగొట్టగా, అశ్విన్7 వికెట్లు తీశాడు. ఇక ఇంగ్లాండ్‌ స్పిన్నర్లలో లీచ్‌ 4, రూట్‌ 5 వికెట్లు తీశారు.

Tags:    

Similar News