PM Modi Letter To Raina : రైనాకి లేఖ రాసిన ప్రధాని మోడీ

PM Modi Letter To Raina : ఈ నెల 15న అంతర్జాతీయ క్రికెట్‌కి ఇండియన్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా రిటైర్మెంట్

Update: 2020-08-21 07:43 GMT

Suresh Raina, Modi ( File Photo ) 

PM Modi Letter To Raina : ఈ నెల 15న అంతర్జాతీయ క్రికెట్‌కి ఇండియన్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు... ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ధోనీతో పాటుగా రైనాకి కూడా ప్రధాని నరేంద్ర మోడీ లేఖలు రాశారు.

అందులో రైనా గురించి రాసిన లేఖలో మోడీ.. "రైనా నువ్వు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నావు. కానీ దానిని నేను రిటైర్మెంట్‌ అనే పదంతో పిలవలేను.. ఎందుకంటే ఇంకా నీకు ఆడే సత్తా ఉంది. 2011 ప్రపంచ కప్ లో బాగా రాణించావు. అది ఎవరు మరిచిపోరు.. ఇంత త్వరగా ఆటకు వీడ్కోలు పలుకుతావని అస్సలు ఊహించలేదు. ఏది ఏమైనా నీ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ సజావుగా సాగాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని మోడీ పేర్కొన్నారు.

అయితే మోడీ లేఖ పైన సురేష్ రైనా ట్విట్టర్ వేదికగా స్పందించాడు.. "మేము ఆటను ఆడేటప్పుడు దేశం కోసం చెమట, రక్తం చిందిస్తాం. దేశ ప్రధానితో పాటు, ప్రజలు మా ప్రదర్శనను మెచ్చుకోవడం కంటే గొప్ప విషయం ఏముంటుంది. మీరిచ్చిన ఈ సందేశాన్ని కృతజ్ఞతతో అంగీకరిస్తున్నా. జైహింద్" అంటూ రైనా స్పందించాడు.

2005లో శ్రీలంకపై తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రైనా.. ఇప్ప‌టివ‌ర‌కూ 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లాడాడు. వన్డే మ్యాచ్ లో 5615 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండగా 36 అర్థసెంచరీలు ఉన్నాయి. అలాగే టెస్టు లో .. 18 మ్యాచులు ఆడిన రైనా.. ఒక సెంచరీ, ఏడు అర్థ సెంచరీలతో మొత్తం 768 పరుగులు చేశాడు. టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ పేరు పొందాడు. 2020 టీ20 వరల్డ్‌కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని ఆశించాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీ 2022కి వాయిదాపడిపోయింది.



Tags:    

Similar News