Pakistan Cricketer Babar Azam: దయచేసి నన్ను కోహ్లీతో పోల్చొద్దు..
Pakistan Cricketer Babar Azam: ఇండియన్ క్రికెట్ టీం కి ఆడాలి అనుకునే యంగ్ స్టర్స్ కి ఇప్పుడు కెప్టెన్ కోహ్లీనే స్ఫూర్తి అని చెప్పాలి.
Pakistan Cricketer Babar Azam: ఇండియన్ క్రికెట్ టీం కి ఆడాలి అనుకునే యంగ్ స్టర్స్ కి ఇప్పుడు కెప్టెన్ కోహ్లీనే స్ఫూర్తి అని చెప్పాలి. అతి తక్కువ సమయంలో అటు ఆటగాడిగా ఇటు కెప్టెన్ గా ఎదిగాడు కోహ్లీ.. ఇక సచిన్ రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్ కూడా కేవలం కోహ్లీకి మాత్రమే ఉంది.. ఇక ఇది ఇలా ఉంటే తనని కోహ్లీతో పోల్చద్దు అంటూ పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సూచించాడు. గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా తన ఆటను ప్రదర్శిస్తున్న బాబర్ ఆజామ్ ని చూసి పాక్ అభిమానులు ముద్దుగా పాక్ కోహ్లీ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు కూడా విరాట్ కోహ్లీ, బాబర్ మధ్య పోలికని ఇష్టపడుతున్నారు.
అయితే ఇది ఇష్టపడని బాబర్ దీనిపైన స్పందిస్తూ తనని కోహ్లీతో పోల్చవద్దు అంటూ స్వయంగా చెప్పుకొచ్చాడు. మీరు పోల్చాలి అనుకుంటే పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్లు జావెద్ మియాందాద్, మహ్మద్ యూసఫ్, యూనిష్ ఖాన్‌లతో పోల్చండి అంటూ బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు. తాజాగా అతనికి టీ20, వన్డే కెప్టెన్సీ బాధ్యతలు రావడంతో ఇంగ్లాండ్ టూర్ అతనికి మరింత సవాల్ గా మారనుంది.. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ల నుంచి విమర్శల్ని తప్పించుకునే ఎత్తుగడలో భాగంగా ఆ పోలికకి స్వస్తి చెప్పాలని బాబర్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.. అయితే గతంలో బాబర్ ఆజామ్ స్వయంగా ఎన్నోసార్లు కోహ్లీలా ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడు కోహ్లీతో పోల్చొద్దు అంటూ చేసిన ఈ వాఖ్యలు అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఇక కోహ్లీ 2008లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి 86 టెస్టులు, 248 వన్డేలు, 81 టీ20 లు ఆడి, అన్ని ఫార్మాట్లలోనూ 50కిపైగా సగటుతో కొనసాగుతున్నాడు.. అటు అజామ్ 26 టెస్టులు, 74 వన్డేలు, 38 టీ20 మ్యాచ్‌లాడి.. 16 సెంచరీలు సాధించాడు బాబర్.