Babar Azam: టీమిండియాపై తప్పక గెలిచి తీరుతాం.. ఓపెనర్ గానే వస్తా
* అక్టోబర్ 24 న జరగబోయే భారత్ - పాక్ మ్యాచ్ పై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కీలక వ్యాఖ్యలు
T20 World Cup 2021 - Babar Azam: ఐపీఎల్ ముగిసిన మరుసటి రోజు నుండే టీ20 ప్రపంచకప్ 2021 మొదలుకానున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 17న క్వాలిఫైర్ మ్యాచ్ లతో ప్రారంభం కానుండగా అక్టోబర్ 23న ఆస్ట్రేలియా - సౌత్ఆఫ్రికా మధ్య మొదటి లీగ్ మ్యాచ్ మొదలుకానుంది. ఇక అక్టోబర్ 24న భారత్ - పాక్ మధ్య దాయాదుల హోరాహోరి పోరు జరగనున్న నేపధ్యంలో తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
భారత్ తో జరగబోయే మ్యాచ్ లో ఓపెనర్ గా రిజ్వనాతో తానే బరిలోకి దిగుతానని, ఆ మ్యాచ్ లో తప్పకుండా భారత్ పై విజయం సాధిస్తామని కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం హఫీజ్, మాలిక్ వంటి సీనియర్ ఆటగాళ్ళు జట్టులో ఉండటం తమకు కలిసొచ్చే అంశమని వారి సలహాలు, సూచనలను తప్పకుండా పాటిస్తామని బాబర్ ఆజమ్ తెలిపాడు.
ఇప్పటివరకు భారత్ పాక్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలతో పాటు ప్రపంచకప్ లలో జరిగిన 5 మ్యాచ్ లలో భారత్ నాలుగింట్లో గెలుపొందగా, పాక్ ఒక మ్యాచ్ లో గెలిచింది. ప్రస్తుతం భారత జట్టు యూఏఈలో ఆడుతున్నా.. మా జట్టుకి అరబ్ దేశాల్లో గత మూడు, నాలుగేళ్ళుగా మ్యాచ్ లు ఆడుతున్న అనుభవం ఉందని అదే మా గెలుపుకు సహకరిస్తుందని చెప్పుకొచ్చాడు.