Mohammad Hafeez To Isolate : చిక్కుల్లో పాక్ క్రికెటర్ .. ట్వీట్‌తో ఇలా దొరికిపోయాడు!
Mohammad Hafeez To Isolate : ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ కోసం గాను 29 మందితో కూడిన జట్టుని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
Mohammad Hafeez To Isolate : ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ కోసం గాను 29 మందితో కూడిన జట్టుని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అక్కడికి పంపించింది.. ప్రస్తుతం పాక్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ప్రస్తుతం కరోనా బాగా విస్తరుస్తున్న క్రమంలో ఆటగాళ్ళ భద్రత పైన క్రికెట్ బోర్డులు ప్రత్యేక దృష్టిని కనబరిచాయి.. అందులో భాగంగానే సిరీస్‌కి నెల రోజుల ముందే పాకిస్థాన్ జట్టుని అక్కడికి పిలిపించుకున్న ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).. ఆటగాళ్లని క్వారంటైన్‌లో ఉంచి రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించిన తర్వాత వారిని బయో- సెక్యూర్ బబుల్‌లోకి అనుమతించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటగాళ్ళు అందులోనే కొనసాగుతున్నారు..
బయో- సెక్యూర్ బబుల్ విధానం అంటే ఆటగాళ్ళు ఎవరు కూడా బయట వాళ్ళని ప్రత్యక్షంగా కలవకూడదు అన్నమాట... కానీ ఈ రూల్స్ ని బ్రేక్ చేశాడు పాక్ ఆటగాడు మహ్మద్ హఫీజ్.. ఇంతకి మహ్మద్ హఫీజ్ ఎం చేశాడంటే.. సరదాగా గోల్ఫ్ ఆడేందుకు వెళ్లి అక్కడ ఓ 90 ఏళ్ల పెద్దావిడతో రెండు మీటర్ల సామజీక దూరం పాటిస్తూ ఫొటో దిగాడు.. ఈ విషయాన్ని అతనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.. దీనితో అతను బయో- సెక్యూర్ బబుల్ రూల్స్‌ని బ్రేక్ చేసినట్టు అయింది.. దాంతో.. అతడ్ని ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచారు.
ఈ అయిదు రోజుల్లో మహ్మద్ హఫీజ్ కి రెండు సార్లు కరొనా టెస్టులు నిర్వహించనున్నారు. ఇందులో నెగిటివ్ వస్తేనే మళ్ళీ హఫీజ్ జట్టుతో కలుస్తాడు.. 39 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ రూల్స్ బ్రేక్ చేయడం పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అతను ఒంటరిగా ఉంటున్నాడు.
Met an inspirational Young lady today morning at Golf course. She is 90+ & & living her life healthy & happily.Good healthy routine 😍👍🏼 pic.twitter.com/3tsWSkXl1E
— Mohammad Hafeez (@MHafeez22) August 12, 2020