Australian Open: విజేత అతడే..

Update: 2021-02-21 12:12 GMT

Novak Djokovic ఫోటో హన్స్ ఇండియా 

Australian Open: వరల్డ్ నంబర్ వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌లో తన సత్తాను మరోసారి చాటాడు. తన ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తూ మరోసారి గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో మెద్వెదెవ్‌తో జరిగిన ఫైనల్లో 7-6, 6-2, 6-2 తేడాతో గెలుపొందాడు. తొలిసెట్‌ హోరాహోరీగా సాగినా.. తర్వాతి రెండు సెట్లలో జకోవిచ్ ‌ పైచేయి సాధించాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో మూడు ఏస్‌లు సంధించిన అతడు.. 20 విన్నర్లు కొట్టి ప్రత్యర్థిపై సత్తా చాటాడు.

నోవాక్ జోకోవిచ్‌ (Novak Djokovic) ఆస్ట్రేలియా ఓపెన్‌ గెలవడం ఇది తొమ్మిదోసారి. కాగా, తన కెరీర్‌లో ఇది 18వ గ్రాండ్‌స్లామ్‌. వరుసగా గత మూడుసార్లు ఈ టైటిల్‌ను అందుకోవడమేకాక, అతడు ఆడిన అన్ని ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్స్‌లోనూ విజయం సాధించడం మరో విశేషం. మరోవైపు ఆల్‌టైమ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల (20) జాబితాలో ఫెదరర్, నాదల్ సరసన చేరడానికి మరో రెండు టైటిళ్ల దూరంలో ఉన్నాడు జకోవిచ్.

Tags:    

Similar News