IND vs NZ 2nd Test: భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. కివీస్ 13/1
India vs New Zealand 2nd Test: ముంబయి టెస్టులో టీమిండియా 540 పరుగుల విజయ లక్ష్యాన్ని కివీస్ ముందుంచింది. మూడోరోజు, ఆదివారం 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసి భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ ప్రకటించింది.ఇక ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 69/0 తో మూడోరోజు టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించగా 38 పరుగులతో క్రీజులోకి వచ్చిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 62 అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో అదరగొట్టిన మయాంక్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్ లోను హాఫ్ సెంచరీ సాధించాడు. మయాంక్ అగర్వాల్ తో పాటు 29 పరుగులతో క్రీజులోకి అడుగుపెట్టిన ఛటేశ్వర పుజారా 47 పరుగుల వద్ద ఔటైయ్యాడు.
యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (47), విరాట్ కోహ్లీ (36), అక్సర్ పటేల్ (41) పరుగులు చేసి ఔటయ్యారు. రెండో ఇన్నింగ్స్ లో కూడా న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 4 వికెట్లు పడగొట్టగా.., రవీంద్ర 3 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు ఆరంభంలోనే అశ్విన్ బౌలింగ్ లో టామ్ లాథమ్(6) వికెట్ కోల్పోయింది. టీ బ్రేక్ సమయానికి కివీస్ 13/1 పరుగుల వద్ద ఉంది. క్రీజులో యంగ్ (7), మిచెల్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.