New Zealand offers to host IPL 2020:ఐపీఎల్ నిర్వహించడానికి మేము సిద్ధం : న్యూజిలాండ్
New Zealand offers to host IPL 2020: లాక్ డౌన్ వలన నష్టపోయిన రంగాలలో క్రీడా రంగం కూడా ఒకటి.. సంవత్సరం మొత్తం ఫిక్స్ అయిన షెడ్యుల్ ని కరోనా మొత్తం తలకిందులు చేసేసింది.
New Zealand offers to host IPL 2020: లాక్ డౌన్ వలన నష్టపోయిన రంగాలలో క్రీడా రంగం కూడా ఒకటి.. సంవత్సరం మొత్తం ఫిక్స్ అయిన షెడ్యుల్ ని కరోనా మొత్తం తలకిందులు చేసేసింది. కొన్ని సిరీస్ లు అయితే మధ్యలో రద్దు అయిపోయాయి. ఇక ఐపీఎల్ 2020 అయితే వాయిదాల మీదా వాయిదాలు పడుతూ వస్తోంది. అసలు ఐపీఎల్ 2020 ఈ సంవత్సరంలో ఉంటుందా అన్న అనుమానం కూడా కలుగుతుంది.
ఈ క్రమంలో ఈ ఏడాది ఐపీఎల్ ని విదేశాల్లో నిర్వహిస్తారని రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజగా ఓ బీసీసీఐ లోని ఓ అధికారి కూడా ఈ ఏడాది ఐపీఎల్ ని శ్రీలంక, దుబాయ్ లో నిర్వహించే ఛాన్స్ లు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పడు తాజాగా ఐపీఎల్ ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నమాని న్యూజిలాండ్ స్పష్టంచేసింది. ఈ మేరకు బీసీసీఐకి లేఖ రాసింది. ఇక అటు బీసీసీఐ కూడా ఐపీఎల్ ని సెప్టెంబర్-నవంబర్ ప్రారంభంలో నిర్వహించేందుకు ఆలోచనలు చేస్తోంది. అటు తాజాగా కొవిడ్ -19 నుంచి న్యూజిలాండ్ దేశం బయటపడింది.
ఐపీఎల్ 2020 ని ముందుగా భారత్ లోనే నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. కానీ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోవడంతో విదేశాల్లో నిర్వహిచేందుకు ప్లాన్ చేస్తోంది. గతంలో 2009, 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ విదేశాల్లోనే ఐపీఎల్ ని నిర్వహించింది. 2019 లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో పోల్ తేదీలతో ఇబ్బంది పడకుండా ఉండేలా ఐపీఎల్‌ను షెడ్యూల్ ని ప్లాన్ చేసింది.
ఇక భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 24,248 కేసులు నమోదు కాగా, 425 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం 6,97,413 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,53,287 ఉండగా, 4,24,433 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 19,693 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,80,956 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 99,69,662 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.