Neeraj Chopra: క్రీడాకారులు వీధుల్లోకి రావడం చూస్తుంటే ఎంతో బాధగా ఉంది
Neeraj Chopra: న్యాయం జరిగేలా చూడాలని కోరిన నీరజ్ చోప్రా
Neeraj Chopra: క్రీడాకారిణులపై లైంగిక వేధింపులపై దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్స్ చేపట్టిన నిరసన దీక్షకు క్రీడా వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా తన సంఘీభావం ప్రకటించారు. న్యాయం కోరుతూ క్రీడాకారులు వీధుల్లోకి రావడం తనను ఎంతగానో బాధిస్తోందని ట్వీట్ చేశారు. న్యాయం జరిగేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా కోరారు. గతంలోనూ వీరికి ఒలింపిక్ ఛాంపియన్ షూటర్ అభినవ్ బింద్రా మద్దతు పలికారు. మరోవైపు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష మాత్రం రెజ్లర్లు ఇలా రోడ్డెక్కడాన్ని తప్పుపట్టారు.