IPL 2021: సెంటిమెంట్ ఫలిస్తుందా... ఓడి గెలిస్తే టైటిల్ వారిదేనా?

IPL 2021: సెంటిమెంట్ ఫాలో అవుతున్న వాళ్లను చూస్తే... మనం సెంటిమెంటల్ ఫూల్స్ అంటుంటాం.

Update: 2021-04-14 12:00 GMT

ముంబయి టీం (ఫొటో ట్విట్టర్)

IPL 2021: సెంటిమెంట్ ఫాలో అవుతున్న వాళ్లను చూస్తే... మనం సెంటిమెంటల్ ఫూల్స్ అంటుంటాం. అలా అని వారు సెంటిమెంట్ ను లైట్ గా తీసుకోరు. ఎందుకంటే వారి నమ్మకం వారిది. ఇక ఐపీఎల్ లోనూ సెంటిమెంట్ ను ఫాలో అవుతోంది ఓ జట్టు. మరి వారి సెంటిమెంట్ ఈ సారి ఫలిస్తుందా.. లేదా బెడిసికొడుతుందా..?

ముంబయి ఇండియన్స్ ఐపీఎల్‌లో ఓ సెంటిమెంట్‌ని ఫాలో చేస్తుంది. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే 2013 నుంచి టోర్నీలో ముంబయి టీం ఆడిన ఫస్ట్ మ్యాచ్‌ల్లో ఓడిపోతుంది. ఇలా ఫస్ట్ మ్యాచ్ లో ఓడి.. సెకండ్ మ్యాచ్‌లో గెలుస్తుంది. ఇలా జరిగిన ప్రతీ సీజన్‌లో ఆ జట్టు టైటిల్ విజేతగా నిలుస్తూ వస్తోంది.

అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకంటారా...? ఈ సీజన్‌లోనూ ఆడిన మొదిటి మ్యాచ్ లో బెంగళూరు చేతిలో ఓడిపోయింది. ఇక నిన్న జరిగిన రెండో మ్యాచ్ లో ఓడిపోతారున్న మ్యాచ్ లో అద్భుతంగా రాణించి గెలిచింది రోహిత్ టీం. దీంతో ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ ముంబయి టోర్నీ విజేతగా నిలవబోతోందంటూ ఎంఐ అభిమానులు సోషల్ మీడియాలో ఫ్యూచర్ చెప్సేస్తున్నారు.

2019, 2020లోనూ ఇదే తరహాలో ఫస్ట్ మ్యాచ్‌లో ఓడి.. రెండో మ్యాచ్‌లో గెలిచింది ముంబయి టీమ్. ఆ టోర్నీలో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 2019లో చెన్నై చేతిలో ఫస్ట్ మ్యాచ్‌లో ఓడి.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతాపై గెలిచింది. 2020లో ఫస్ట్ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడి.. రెండో మ్యాచ్‌లో బెంగళూరుపై గెలిచింది. ఈ రెండు సార్లుకూడా ట్రోఫిని సాధించింది. దీంతో ఈ సీజన్ లోనూ ట్రోఫీని సాధింస్తుందా లేదా చూడాలి. సెంటిమెంట్ వర్కట్ అయితే కప్ ముంబయిదే మరి.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 13 సీజన్లు ముగిశాయి. ముంబయి ఇండియన్స్ వరుసగా 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఐదు సార్లు రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఆ జట్టు టోర్నీ విజేతగా నిలవడం విశేషం.


Tags:    

Similar News