India vs England: టీమిండియాలో అదరగొడుతోన్న ముంబై ఇండియన్స్

India vs England: టీమిండియా తరపున అరంగేట్రం చేస్తున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు.

Update: 2021-03-23 15:33 GMT

ఇషాన్ కిషన్, సూర్య కుమార్, క్రునాల్ పాండ్య

India vs England: టీమిండియా తరపున అరంగేట్రం చేస్తున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇషాన్ కిషన్, సూర్య కుమార్, క్రునాల్ పాండ్యా లు ముగ్గురు తమ తొలి మ్యాచ్ లోనే ఆకట్టుకునేలా బ్యాటింగ్ చేసి అలరించారు. ఈ ముగ్గురు ముంబై ఇండియన్స్ టీం మెంబర్సే కావడం గమనార్హం. టీమిండియాకు ఆడాలంటే ముంబై ఇండియన్స్ టీం లో స్థానం సంపాదిస్తే చాలు అంటున్నారు ఫ్యాన్స్.

ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్, ఇండియా టీ20, వన్డే సిరీస్‌లలో ఆడిన తొలి మ్యాచ్ లోనే సత్తా చూపుతూ... ముంబై ఇండియన్స్ టీం పేరును నిలబెడుతున్నారు.

టీ20 సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్, సూర్య కుమార్ సూపర్ బ్యాటింగ్ తో సత్తా చూపారు. అలాగే మంగళవారం జరిగిన వన్డే మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చిన క్రునాల్ పాండ్యా సైతం ముంబై ఇండియన్స్ పేరు చాటేలా.. హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

కాగా, కేవలం హాస్ సెంచరీలతోనే కాదు... బాల్స్ తోనూ పోటీ పడ్డారు. ఇషాన్, సూర్య కుమార్ లు 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా... క్రునాల్ పాండ్యా మాత్రం కేవలం 26 బంతుల్లోనే అర్థ సెంచరీతో నాటౌట్ గా నిలిచి టీమిండియా భారీ స్కోర్ చేసేందుకు సహాయపడ్డాడు.

'భయపడకుండా క్రికెట్ ఆడుతాం కాబట్టే మేం సక్సెస్ అవుతున్నా' మని ఈ మధ్య సూర్యకుమార్ చెప్పడం చూస్తే... ముంబై టీం ప్లేయర్స్ ను ఎంతలా ప్రోత్సహిస్తుందో తెలుస్తోంది.

ఇలా ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ రాణించడంతో ఆ టీం ఎంతో సంతోషంలో ఉంది. వీరే కాక రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బూమ్రా, రాహుల్ చాహార్, శిఖర్ ధావన్ కూడా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించనవారే కావడం గమనార్హం. ఇక ఫ్యాన్స్ మాత్రం కీ పిట్ అఫ్ ముంబై ిఇండియన్స్ అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. మంచి ప్లేయర్స్ ను అందిస్తున్న ముంబై టీం... భవిష్యత్ లో మరింతమంది అద్భుత ఆటగాళ్లను టీమిండియాకు అందివ్వాలని కోరుకుందాం.


Tags:    

Similar News