చెన్నై హ్యాట్రిక్‌ విజయాలకు ముంబై బ్రేక్‌

Update: 2019-04-04 02:29 GMT

చెన్నై హ్యాట్రిక్‌ విజయాల జోరుకు ముంబై బ్రేకులు వేసింది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ చెలరేగిపోయింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ పటిష్ఠమైన చెన్నైకి చెక్ పెట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్‌), కృనాల్‌ పాండ్యా (32 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులకే పరిమితమైంది. లీగ్‌లో ముంబైకిది రెండో గెలుపు కాగా.. చెన్నైకి తొలి ఓటమి. 

Similar News