Team India: భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే భద్రం.. కోచ్ గా ద్రావిడ్, మెంటర్ గా ధోని

భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టుకి కోచ్ గా ద్రావిడ్, మెంటర్ గా ధోని ఆయినే కరెక్ట్ : భారత మాజీ సెలెక్టర్ ప్రసాద్

Update: 2021-10-13 11:51 GMT

ధోని - రాహుల్ ద్రావిడ్ (ఫైల్ ఫోటో)

Team India: భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న రవిశాస్త్రి త్వరలో మొదలుకానున్న టీ20 ప్రపంచకప్ 2021 తరువాత కోచ్ బాధ్యతల నుండి తప్పుకోబోతుండటంతో కొత్త కోచ్ కొరకు బిసిసిఐ ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే మొదట కోచ్ లిస్టులో భారత మాజీ ఆటగాళ్ళు అనిల్ కుంబ్లే, వివిఎస్ లక్ష్మన్ ఉండగా అందులో కుంబ్లే ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించడం.. లక్ష్మన్ పై బిసిసిఐ అంతగా ఆసక్తి చూపకపోవడంతో విదేశీ కోచ్ ను ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకుంది.

అందులో భాగంగా టామ్ మూడీతో పాటు శ్రీలంక మాజీ ఆటగాడు మహేలా జయవర్దనేలలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయాలని బిసిసిఐ భావించింది. కాని తాజాగా భారత జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ భారత జట్టుకు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఉంటే బాగుంటుందని, ఇప్పటికే భారత జట్టు అండర్ 19 టీంకి కోచ్ గా విజయవంతంగా తన బాధ్యతలను నిర్వహిస్తున్న ద్రావిడ్ ఇటీవల శ్రీలంక పర్యటన వెళ్ళిన భారత జట్టుకు కోచ్ గా వ్యవహరించిన సంగతిని గుర్తు చేశాడు.

అయితే భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టుకి కోచ్ గా రాహుల్ ద్రావిడ్, మెంటర్ గా ధోని ఉంటేనే భారత క్రికెట్ జట్టు అద్భుత విజయాలను సాధించడమే కాకుండా యువ ఆటగాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయని తన మనసులోని మాట చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News