MSK Prasad On Rishabh Pant : అదే రిషబ్ పంత్ కొంప ముంచింది!

MSK Prasad On Rishabh Pant : భారత్ యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఇండియన్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పోల్చుకోవడమే

Update: 2020-09-09 11:45 GMT

Rishabh Pant

MSK Prasad On Rishabh Pant : భారత్ యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఇండియన్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పోల్చుకోవడమే అతని వైఫ్యల్యానికి కారణమని అన్నారు టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. మైదానంలోకి వచ్చిన ప్రతిసారి పంత్ ధోనితో పోల్చుకొని భ్రమలో ఉండేవాడిని అన్నాడు.. కొన్ని మ్యాచ్‌ల్లో పంత్ వ్యవహారశైలి చూస్తే  ఈజీగానే అర్ధం అవుతుందని ఎమ్మెస్కే అన్నారు.. ధోనితో పోల్చుకోవద్దని అతనికి చాలా సార్లు చెప్పామని, కానీ అతనిలో ఆ మార్పు కనిపించలేదని అన్నారు.. ధోని నీడ నుంచి ఎప్పుడు అయితే పంత్ బయటకు వస్తాడో అప్పుడే అతను మరింత మెరుగైన ఆటగాడు అవుతాడని అన్నాడు..

ఇక ధోని ఇప్పుడు ఎలాగూ రిటైర్ అయిపోయాడు కాబట్టి అతని నీడ నుంచి బయట పడాల్సిన అవసరం ఉందని సూచించాడు.. అతని ఆట తీరులో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టుగా ఎమ్మెస్కే ఆశాభావం వ్యక్తం చేశారు. టెస్టుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో సెంచరీ కొట్టిన ఏకైక భారత వికెట్ కీపర్ పంత్ కాబట్టి అతనిలో చాలా ప్రతిభ ఉందని కొనియాడారు.. తాజాగా స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ వైఫల్యంపై  ఈ వాఖ్యలు చేశారు ఆయన..

ఇక ధోని వారసుడిగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన పంత్ అవకాశాలను దక్కించుకుంటున్నాడు కానీ వాటిని సరిగ్గా సద్వినియోగ పరుచుకోవడం లేదు .. జట్టులో కేఎల్ రాహుల్‌తో అతనికి తీవ్ర పోటీ ఉందని చెప్పాలి. అనవసరమైన షాట్లు, కీపింగ్‌లోనూ తడబడడం లాంటి అంశాలు పంత్ ని తీవ్ర విమర్శలకి గురిచేస్తోంది. ఇక అదే పంత్ స్థానంలో వికెట్ కీపింగ్ చేసిన కేఎల్ రాహుల్ సూపర్ సక్సెస్ కావడం పంత్ అవకాశాలపై ప్రభావం చూపుతుంది. అటు వృద్దిమాన్ సాహా, సంజూ శాంసన్ లాంటి వికెట్ కీపర్ లతో పంత్ కి గట్టి పోటీ ఉందని చెప్పవచ్చు .


Tags:    

Similar News