Team India: ఆయన రిటైర్మెంట్ ప్రకటన ఆశ్చర్యం.. ఆటగాళ్లతో పాటు నేను షాక్‌ అయ్యా: మాజీ కోచ్ రవిశాస్త్రి

MS Dhoni-Ravi Sha: 2014 సంవత్సరంలో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అక్కడ మహేంద్ర సింగ్ ధోని టెస్టుల నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు.

Update: 2021-12-27 15:30 GMT

Team India: ఆయన రిటైర్మెంట్ ప్రకటన ఆశ్చర్యం.. ఆటగాళ్లతో పాటు నేను షాక్‌ అయ్యా: మాజీ కోచ్ రవిశాస్త్రి

Team India: భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన నిర్ణయాలకు సంబంధించి ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాడనేది వాస్తవం. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ధోని గురించి తాజాగా సంచలన విషయాలు వెల్లడించడంతో మరోసారి అది రుజువైంది. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. అతని నిర్ణయంతో టీమ్ అంతా ఆశ్చర్యపోయిందంటూ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ధోని గురించి ఇప్పటి వరకు జనాలకు తెలియని ఎన్నో విషయాలను శాస్త్రి పంచుకున్నాడు. 'కెప్టెన్ కూల్'‌గా పేరుగాంచిన ధోని ఇలాంటి ఎన్నో షాక్‌లు ఇచ్చాడంటూ శాస్త్రి తెలిపాడు.

జట్టును పిలిచి రిటైర్మెంట్ ప్రకటించాడు..

ఒక స్పోర్ట్స్ ఛానెల్‌తో జరిగిన సంభాషణలో ధోని రిటైర్మెంట్ గురించి రవిశాస్త్రి చాలా విషయాలు వెల్లడించారు. ఆస్ట్రేలియన్ టూర్‌లో టీమ్ ఇండియా మంచి ప్రదర్శన చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అయితే ఆ తర్వాత ధోని, రవిశాస్త్రి వద్దకు వచ్చి జట్టును ఉద్దేశించి మాట్లాడాలంటూ కోరాడంట. నిజానికి ఆ సమయంలో రవిశాస్త్రి టీమ్ ఇండియా మేనేజర్‌గా ఉన్నాడు. జట్టులోని ఆటగాళ్లందరూ గుమిగూడిన సమయంలో ధోనీ అకస్మాత్తుగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మహి తీసుకున్న ఈ నిర్ణయానికి అంతా షాక్‌లో ఉండిపోయారంట.

మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ కోసం సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడని రవిశాస్త్రి తెలిపాడు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో రాణిస్తున్నాడని, భవిష్యత్తులో జట్టును నడిపించగలడని భావించిన ధోని రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. అయితే వన్డే, టీ20 క్రికెట్‌లో కొనసాగాలని మహేంద్ర సింగ్ ధోనీ నిర్ణయించుకున్నాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ధోని తర్వాత విరాట్‌కు టెస్టు కెప్టెన్సీ లభించగా, అతని కెప్టెన్సీలో జట్టు కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. ప్రస్తుతం కోహ్లి సారథ్యంలో టీమిండియా దక్షిణాఫ్రికాలో సిరీస్ ఆడుతోంది.

మిస్టర్ కూల్ కెరీర్‌ విషయానికి వస్తే.. 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి, 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచులు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా 2008 నుంచి ఆడుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు మొత్తం 220 మ్యాచులు ఆడాడు.

Tags:    

Similar News