Dhoni: రిటైర్మెంట్ ఏడాదికో..5 ఏళ్ళకో తెలియదు.. చివరి మ్యాచ్ మాత్రం చెన్నైలోనే
*చెన్నైలోని ఆరంగం ఆడిటోరియంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ యాజమాన్యం విజయోత్సవాలు
MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా చెన్నైలోని ఆరంగం ఆడిటోరియంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ యాజమాన్యం విజయోత్సవాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు మహేంద్ర సింగ్ ధోని, కపిల్ దేవ్, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ పాల్గొన్నారు. ఇపటికే నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ ని గెలుచుకున్న చెన్నై టీమ్ పై సీఎం స్టాలిన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
అంతేకాకుండా స్టాలిన్ పేరుతో ఉన్న జెర్సీ నంబర్ 7ని ధోని, స్టాలిన్ ఆవిష్కరించారు. ఏ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని తన రిటైర్మెంట్ పై మరోసారి మాట్లాడాడు. తాను ఎప్పుడు రిటైర్ అవుతానో ఇంకా తనకే తెలియదని.. ఏడాదికి రిటైర్ అవుతానో లేదా మరో అయిదేళ్ళకు అవుతానో క్లారిటీ లేదని..కాని ఎప్పుడు రిటైర్ అయిన తన చివరి మ్యాచ్ మాత్రం చెన్నైలోనే ఉంటుందని ధోని ఈ సందర్భంగా అభిమానులకు మరోసారి క్లారిటీ ఇచ్చాడు.
తన తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నైలోనే ఆడానని అంతేకాకుండా 2008 నుండి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని ధోని చెప్పుకొచ్చాడు. తాను పుట్టి పెరిగిన నగరాలతో పోలిస్తే చెన్నైతోనే తనకి ఎక్కువ అనుబంధం ఉందని ఈ కార్యక్రమంలో ధోని తెలిపాడు.