లక్నో, అహ్మదాబాద్ జట్లను కైవసం చేసుకున్న మాంచెస్టర్ యునైటెడ్, ఆదాని గ్రూప్..!?
IPL Auction 2022: అక్టోబర్ 25 సోమవారం రోజున బీసీసీఐ ఐపీఎల్ లో రెండు కొత్త జట్ల కోసం బిడ్లను ఆహ్వానించింది. దాదాపు 9 కార్పొరేట్ సంస్థలు రెండు జట్ల కోసం బిడ్లను సమర్పించాయని తెలుస్తోంది. దుబాయ్‌లోని తాజ్ దుబాయ్‌లో ఈ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. అయితే ఈ ఆక్షన్ లో లక్నోని మాంచెస్టర్ యునైటెడ్ తో పాటు అహ్మదాబాద్ ను ఆదాని గ్రూప్ కైవసం చేసుకున్నట్లు సమాచారం..ఈ విషయాన్ని బిసిసిఐ మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.
దీంతో ఈ రానున్న ఐపీఎల్ 2022లో పది జట్లతో బిసిసిఐ 74 మ్యాచ్ లను నిర్వహించి దాదాపుగా 5000-7000 వేల కోట్ల ఆదాయాన్ని పొందనుంది. ఇక గతంలోనే ఐపీఎల్ జట్టును సొంతం చేసుకోవాలని ఉందంటూ ఆదాని ప్రకటన చేసినట్టుగానే ఈసారి ఐపీఎల్ అహ్మదాబాద్ జట్టును దక్కించుకున్నాట్లు తెలుస్తుంది.
ప్రపంచంలోని ఖరీదైన ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ కూడా ఐపీఎల్ జట్టు కొనేందుకు ఎప్పటినుంచో ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ కు అవ్రామ్ గ్లేజర్, జోయెల్ గ్లేజర్ యజమానులు. అయితే లక్నో జట్టును మాంచెస్టర్ యునైటెడ్ కైవసం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం ఈ క్లబ్ తరఫునే ఆడుతున్నాడు..