IPL 2023: వామ్మో.. ఈ ఆటగాళ్ల జీతం కంటే.. ఎల్‌ఈడీ స్టంప్స్ ధరే ఎక్కువ.. లిస్టులో రహానే కూడా..!

LED Stumps: ఐపీఎల్ 2023 సందడి కొనసాగుతోంది. ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులతోపాటు ప్రేక్షకులకు మాంచి వినోదాన్ని అందిస్తున్నాయి.

Update: 2023-04-20 11:30 GMT

IPL 2023: వామ్మో.. ఈ ఆటగాళ్ల జీతం కంటే.. ఎల్‌ఈడీ స్టంప్స్ ధరే ఎక్కువ.. లిస్టులో రహానే కూడా..!

LED Stumps: ఐపీఎల్ 2023 సందడి కొనసాగుతోంది. ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులతోపాటు ప్రేక్షకులకు మాంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే.. ఐపీఎల్‌లో ఉపయోగించే ఎల్‌ఈడీ స్టంప్‌ల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎల్‌ఈడీ స్టంప్స్ చాలా ఖరీదైనవి. చాలా మంది ఆటగాళ్లకు ఐపీఎల్‌లో పొందే జీతం కంటే ఎక్కువ ధర ఉంటాయనే సంగతి మీకు తెలుసా. అవునండీ బాబూ.. వీటి ధరలు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ప్రైజ్ మనీ కంటే 50 నుంచి 70 రెట్లు ఎక్కువగా ఉంటాయంట.

LED స్టంప్‌ల సెట్ దాదాపు రూ. 25 నుంచి రూ. 35 లక్షల వరకు ఉంటుందంట. అంటే, ఒక మ్యాచ్‌లో ఉపయోగించిన రెండు సెట్‌లను కలిపితే, వాటి ధర రూ.50 నుంచి రూ. 70 లక్షల మధ్య ఉంటుంది. వివిధ దేశాల్లో వాటి ధరలో స్వల్ప వ్యత్యాసం ఉంటుందంట. ఇవే ఎల్‌ఈడీ స్టంప్‌లను ఐపీఎల్‌లో కూడా ఉపయోగిస్తారు.

ఐపీఎల్‌లో చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇలాంటి ప్లేయర్ల జీతం రూ.50 లక్షల కంటే తక్కువగా ఉంది. ఇందులో అజింక్యా రహానే వంటి వెటరన్‌లు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆటగాడి ఐపీఎల్‌లో ఏడాది జీతం కంటే స్టంప్ ఖరీదు ఎక్కువ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఎల్‌ఈడీ స్టంప్‌లను ఐపీఎల్‌లో లభించే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ప్రైజ్ మనీతో పోల్చితే, ఈ రేసులో ఈ స్టంప్‌లు 50 నుంచి 70 రెట్లు ఎక్కువ ఖరీదుగా ఉంటాయి.

గతంలో క్రికెట్‌లో చెక్కతో చేసిన స్టంప్‌లను మాత్రమే ఉపయోగించేవారు. క్రమక్రమంగా, సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత, ఈ LED స్టంప్స్ క్రికెట్‌లో ఓ భాగమయ్యాయి.

ఈ LED స్టంప్‌లు ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, క్లోజ్ రన్ అవుట్‌లు, స్టంపింగ్‌ల వంటి నిర్ణయాలలో థర్డ్ అంపైర్‌కు చాలా సహాయపడతాయి. బంతి లేదా చేతితో ఈ స్టంప్‌లను తాకిన వెంటనే, వాటి LED ఫ్లాషింగ్ ప్రారంభమవుతుంది. ఇది థర్డ్ అంపైర్‌కు సులభంగా నిర్ణయించేలా చేస్తుంది.

ఎల్‌ఈడీ స్టంప్‌ను ఆస్ట్రేలియాకు చెందిన బ్రోంటే అకర్‌మాన్ కనుగొన్నారు. ఆ తర్వాత అతను డేవిడ్ లెజిట్‌వుడ్‌తో కలిసి జింగ్ ఇంటర్నేషనల్ కంపెనీని స్థాపించాడు. ఇప్పుడు ఈ కంపెనీ పెద్ద సంఖ్యలో స్టంప్‌లను తయారు చేస్తోంది.

Tags:    

Similar News