Cricket: పరుగులు చేస్తే ప్రపంచ కప్ కి అవకాశం.. ధావన్ కి లక్ష్మన్ సూచన
Cricket: టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ ఇటీవలే జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ధావన్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు..
Cricket: టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఇటీవలే జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ శిఖర్ ధావన్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ధావన్ సారధ్యంలో శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకొని తమ ప్రదర్శన ఉండాలని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జట్టులో చోటు సంపాదించాలంటే మంచి ప్రదర్శన ఉండాలని తెలిపాడు. మరోపక్క ఇప్పటికే భారత జట్టులో పొట్టి క్రికెట్ లో ఓపెనింగ్ స్థానాన్ని పదిలంగా ఉంచుకున్న రోహిత్ శర్మ మరియు రాహుల్ స్థానంలో చోటు సంపాదించాలంటే శిఖర్ శ్రీలంక సిరీస్ లో రాణించాలని లక్ష్మన్ తెలిపాడు.
ఇప్పటికే కోహ్లి కూడా తను ఓపెనర్ కూడా రెడీగా ఉన్నానని ప్రకటించిన తర్వాత ఈ సిరీస్ ధావన్ కీలకంగా మారనుంది. ప్రస్తుతం ధావన్ 65 మ్యాచుల్లో 27.88 సగటుతో 1673 పరుగులు చేయగా రాహుల్ మరియు రోహిత్ శర్మ తమ మెరుగైన యావరేజ్ తో ముందున్నారు. ప్రస్తుతం వన్డే, టీ20లో స్థానం పొందిన ధావన్ గత కొంత కాలంగా టెస్ట్ మ్యాచ్ లకి సైతం సరైన ఫామ్ లేక ఎంపిక కాని సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరగబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి జట్టులో స్థానం పొందాలంటే తప్పకుండ శ్రీలంక సిరీస్ లో భారీ పరుగులు చేయకతప్పదని లేదంటే జట్టులో స్థానం దొరకదని చెప్పకనే చెప్పాడు మన మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.