టీమిండియా కెప్టెన్ కోహ్లీ, ధోనికి ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించిన ఐసీసీ

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన డికేడ్ అత్యుత్తమ ఆటగాళ్ల అవార్డుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హవా మరోసారి కొనసాగుతోంది.

Update: 2020-12-28 11:23 GMT

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన డికేడ్ అత్యుత్తమ ఆటగాళ్ల అవార్డుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హవా మరోసారి కొనసాగుతోంది.ఈ దశాబ్దపు ఐసీసీ బెస్ట్ ప్లేయర్ గా ఎంపికైన కోహ్లీకి 'సర్‌ గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌' అవార్డు వరించింది. అంతేగాక ఈ దశాబ్దపు ఉత్తమ వన్డే ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఈ దశాబ్దపు ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు దక్కింది. నాటింగ్‌హామ్‌ వేదికగా 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో ఇయాన్‌ బెల్‌ రనౌట్‌పై ధోనీ ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తికి ఈ అవార్డు లభించిందని ఐసీసీ ప్రకటించింది. కాగా, ప్రతిష్ఠాత్మక 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ సత్తాచాటడం, 70 శతకాలతో అదరగొట్టడంతో ప్రతిష్ఠాత్మక అవార్డు ఎంపిక చేసినట్లు ఐసీసీ వెల్లడించింది.

ఐసీసీ టెస్టు ప్లేయర్ గా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్ స్మిత్‌ నిలిచాడు. అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌కు అలాగే టీ20 ఫార్మాట్‌లో అవార్డు లభించింది. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ అలిసా పెర్రీ ఈ దశాబ్దపు అత్యుతమ మహిళా క్రికెటర్‌గా నిలిచింది. రాచెల్ హేహ ఫ్లింట్‌ ఐసీసీ ఉమెన్స్‌ అవార్డు పొందింది. అంతేగాక ఈ దశాబ్దపు వన్డే, టీ20 ప్లేయర్‌గా నిలిచింది. కాగా, నామినేటెడ్‌ ప్లేయర్లలో అత్యధిక ఓట్లు సాధించిన ఆటగాళ్లకు ఐసీసీ ఈ అవార్డులను ప్రదానం చేసింది.

Tags:    

Similar News