KL Rahul: కేఎల్ రాహుల్ త్వరలోనే రాణిస్తాడు - బ్యాటింగ్ కోచ్
KL Rahul: ఇంగ్లాండ్ తో ఐదు టీ20ల సిరీస్ లో టీమిండియా 2-1 తో వెనుకంజలో ఉంది.
KL Rahul: ఇంగ్లాండ్ తో ఐదు టీ20ల సిరీస్ లో టీమిండియా 2-1 తో వెనుకంజలో ఉంది. టీమిండియా బ్యాట్స్ మెన్స్ లో కెప్టెన్ కోహ్లీ ఫామ్ లోకి రాగా, మిగతా బ్యాట్స్ మెన్స్ దారుణంగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ 3 టీట్వంటీల్లో 0, 0, 1 తో వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తున్నాడు. దీంతో అతడి ఫామ్ పై మాజీ క్రికెటర్లు పలు విమర్శలు కురిపిస్తున్నారు. వరుస వైఫల్యాలతో కేఎల్ రాహుల్ టీం భారంగా మారాడని కొందరు, మరో ప్లేయర్ కు ఛాన్స్ ఇవ్వాలంటు మరికొందరు అంటున్నారు. అయితే.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం రాహుల్ ను వెనకేసుకొస్తున్నాడు.
ప్రతీ ప్లేయర్ కూడా ఏదో ఒక దశలో విఫలమవుతుంటారని, గతేడాదిలో ఇండియా టీంలో టీ20 ఫార్మాట్‌లో.. అందరికంటే కేఎల్ రాహుల్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడని గుర్తు చేశాడు విక్రమ్ రాథోడ్. అతడి బ్యాటింగ్ యావరేజ్ 40గా ఉందని, స్ట్రయిక్ రేట్ 145తో కొనసాగుతుందని వెల్లడించాడు. కేవలం 3 మ్యాచుల్లో విఫలమైతే విమర్శించడం మంచి పద్ధతి కాదని తెలిపాడు. రాహుల్ కు టీం మొత్తం అండగా ఉండాల్సిన టైం ఇది. త్వరలోనే రాహుల్ క్లిష్ట దశను అధిగమిస్తాడని ఆశిస్తున్నాం అని పేర్కొన్నాడు.