IPL 2020 SRH vs KKR: తడబడ్డ కలకత్తా .. హైదరాబాద్ విజయ లక్ష్యం 164
IPL 2020 SRH vs KKR: అబుదాబి వేదికగా హైదరాబాద్, కోల్‌కతా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన కలకత్తా జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో అయిదు వికెట్లను కోల్పోయి 163 పరుగులు చేసింది
IPL 2020 SRH vs KKR: అబుదాబి వేదికగా హైదరాబాద్, కోల్‌కతా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన కలకత్తా జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో అయిదు వికెట్లను కోల్పోయి 163 పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన శుభ్‌మన్‌గిల్, రాహుల్ త్రిపాఠి ఆ జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి మొదటి వికెట్ కి గాను 48 పరుగులు జోడించారు. అయితే నటరాజన్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతికి రాహుల్ త్రిపాఠి(23) బౌల్డ్ కావడంతో ఆ జట్టు మొదటి వికేట్ ని కోల్పోయింది.
ఇక ఆ తర్వాత వచ్చిన నితీశ్ రాణాతో కలిసి జట్టు స్కోర్ ని పరిగెత్తించాడు శుభ్‌మన్‌గిల్ .. దీనితో పది ఓవర్లు అయిపోయేసరికి ఆ జట్టు ఒక వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసింది. ఈ క్రమంలో రషీద్‌ఖాన్ వేసిన 12వ ఓవర్‌లో శుభ్‌మన్‌గిల్(36) ఔటయ్యాడు. దీంతో 87 పరుగుల వద్ద కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. ఈ షాక్ నుంచి బయటపడకముందే ఆజట్టుకి వరుసగా రెండు షాకులు తగిలాయి.
విజయ్ శంకర్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి నితీశ్ రాణా(29), నటరాజన్ వేసిన 15వ ఓవర్‌లో ఆండ్రూరసెల్(9) వికెట్లను కోల్పోయింది ఆ జట్టు.. ఆ తర్వాత కెప్టెన్ మోర్గాన్(34), కార్తీక్(29) కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీనితో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో 163 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో బౌండరీ, సిక్సర్ కొట్టిన మోర్గాన్ చివరి బంతికి ఔటయ్యాడు. దీనితో హైదరాబాద్ విజయ లక్ష్యం 164గా ఉంది.