ఉత్కంఠ పోరులో పంజాబ్ గెలుపు!

Kings XI Punjab Won By 8 Wickets : ఈ ఏడాది ఐపీఎల్‌లో అట్టడుగున నిలిచిన జట్టు పంజాబ్ నిన్న బెంగుళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో ఎనమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనితో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Update: 2020-10-16 02:08 GMT

Kings XI Punjab Won By 8 Wickets : ఈ ఏడాది ఐపీఎల్‌లో అట్టడుగున నిలిచిన జట్టు పంజాబ్ నిన్న బెంగుళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో ఎనమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనితో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాహుల్ (61), గేల్(53) పరుగులు చేయడంతో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్‌ నెగ్గి బ్యాటింగ్ కి వెళ్ళిన బెంగుళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ విరాట్ కోహ్లి (39)మోరిస్‌ (25) పరుగులతో ఆదరగొట్టారు. దీనితో బెంగుళూరు జట్ట్టు 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు గాను 83 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత పంజాబ్ బౌలర్లు బెంగుళూరు బ్యాట్స్ మెన్స్ ని పరుగులు చేయకుండా కట్టడి చేయడంతో పరుగుల వేగం తగ్గింది. ఇక షమీ వేసిన చివరి ఓవర్ లో మోరిస్‌ భారీషాట్లను ఆడడంతో 24 పరుగులు వచ్చాయి. దీనితో బెంగుళూరు జట్టు 171 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ జట్టు నెమ్మదిగా ఇన్నింగ్స్ ని మొదలుపెట్టి ఆ తర్వాత రెచ్చిపోయింది. రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్ అద్భుతమైన షాట్లతో అలరించారు. మొదటి మూడు ఓవర్లకి 18 గా ఉన్నజట్టు స్కోర్.. ఆరో ఓవర్ కి వచ్చేసరికి 50 పరుగులకు చేరుకుంది. మంచి జోరుమీద ఈ జోడికి చహల్‌ చెక్ పెట్టాడు. చహల్ వేసిన ఎనమిదో ఓవర్లో అగర్వాల్‌ బౌల్డయ్యాడు. దీనితో 78 పరుగుల భాగస్వామ్యం వద్ద పంజాబ్ జట్టు మొదటి వికెట్ ని కోల్పోయింది. ఇక సిరాజ్‌ వేసిన 12వ ఓవర్లో రాహుల్‌ వరుసగా 2 సిక్సర్లు బాదడంతో పంజాబ్‌ వంద పరుగుల మార్క్ ని దాటేసింది. అటు మరోవైపు గేల్ విద్వంసం సృష్టించాడు.

అయితే ఈ జట్టుకు చివరి ఓవర్లో విజయానికి 2 పరుగులు అవసరం అనుకున్న క్రమంలో చహల్ పంజాబ్ బాట్స్ మెన్స్ ని ఇబ్బంది పెట్టాడు. కేవలం 4 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. దీనితో ఇరు జట్ల స్కోర్లు సమమైంది. అయితే ఐదో బంతికి గేల్‌ రనౌట్ కావడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠకి దారీ తీసింది. అయితే చివరి బంతికి పూరన్‌ భారీ సిక్సర్‌ బాదడంతో పంజాబ్ అభిమానులు ఉపిరి పీల్చుకున్నారు. 

Tags:    

Similar News