CT Final: పాక్‌కు బిగ్ షాకిచ్చిన భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదికలో మార్పు?

Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ ఐసీసీ టోర్నీ నిర్వహణకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సన్నాహాల్లో బిజీగా ఉంది.

Update: 2024-10-09 06:53 GMT

CT Final: పాక్‌కు బిగ్ షాకిచ్చిన భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదికలో మార్పు?

Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ ఐసీసీ టోర్నీ నిర్వహణకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సన్నాహాల్లో బిజీగా ఉంది. అయితే, టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అనే విషయంపై అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ కచ్చితంగా పాకిస్థాన్‌కు వస్తుందని పీసీబీ చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ టోర్నీ ఫైనల్ స్థానాన్ని భారత్ బట్టి నిర్ణయించవచ్చని ఒక నివేదిక వచ్చింది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ వేదికలో మార్పు..!

 ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధిస్తే దాని మ్యాచ్ పాకిస్తాన్ నుంచి మార్చే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే గ్రూప్ మ్యాచ్‌లు కూడా మార్చనున్నట్లు తెలిపింది. ఫైనల్ మ్యాచ్‌ను లాహోర్‌ నుంచి దుబాయ్‌కి మార్చవచ్చని నివేదికలో పేర్కొంది. మార్చి 9న ఫైనల్ జరగనుంది. అయితే వేదికను నిర్ధారించేందుకు మార్చి 6 వరకు సమయం పట్టవచ్చు.

ఇప్పుడు పాకిస్థాన్ ఏం చేస్తుంది?

2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచీ, రావల్పిండిలో జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. ఫైనల్ మార్చి 9 న జరుగుతుంది. నివేదికలో చెప్పినది నిజమైతే పాకిస్థాన్ ఏం చేస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీని దేశంలోనే నిర్వహిస్తామని చిరకాల ప్రత్యర్థి భారత్‌తో సహా అన్ని జట్లు టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్‌కు వస్తాయన్న విశ్వాసాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోమవారం వ్యక్తం చేశారు.

1996 తర్వాత మొదటిసారి..

పాకిస్థాన్ చివరిసారిగా 1996 వన్డే ప్రపంచకప్ రూపంలో ICC ఈవెంట్‌ను నిర్వహించింది. భారత్, శ్రీలంకతో పాటు పాకిస్థాన్ కూడా దీనికి ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత ఐసీసీ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.

Tags:    

Similar News