Karun Nair: కరుణ్ నాయర్‌ను కావాలనే తొక్కేశారా ? ఈ 9ఏళ్లలో అసలేం జరిగింది?
Karun Nair: కరుణ్ నాయర్ మరోసారి తన ఆటతో అభిమానులను ఆకట్టుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌ను చీల్చిచెండాడిన తీరుతో పాటు, మెరుగైన ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌కు తిరిగి వచ్చాడు. గతంలో చేసిన ట్రిపుల్ సెంచరీ తర్వాత వచ్చిన నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి, తాజా ప్రదర్శనతో సెలెక్షన్లను కదిలించే స్థాయిలో ఫామ్ చూపిస్తున్నాడు.

Karun Nair: కరుణ్ నాయర్‌ను కావాలనే తొక్కేశారా ? ఈ 9ఏళ్లలో అసలేం జరిగింది?
Karun Nair: బుమ్రా బుర్ర ఖరాబ్ అయిపోయింది మావా..! ప్రపంచాన్ని వణికించే టాప్ బౌలర్‌కే ఫ్యూజులు ఎరిగిపోయేలా బాదిపడేయడం ఏంటో నాకైతే ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఐపీఎల్‌లోకి మూడేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్.. ఇప్పుడు వరల్డ్ క్రికెట్‌లో అతి పెద్ద డిస్కషన్‌కు కారణమయ్యాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కరుణ్.. ముంబై టాప్ క్లాస్ బౌలర్లను వణికించేశాడు. తనను పట్టించుకోని సెలక్టర్లకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. 1076 రోజుల విరామం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్... ముంబైపై మ్యాచ్లో తనకిచ్చిన అవకాశం ఎలా వాడుకోవాలో స్పష్టంగా చూపించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ 89 పరుగులు చేసి ఢిల్లీకి కీలక ఇన్నింగ్స్ అందించాడు. ఇది అతడి ఐపీఎల్ కెరీర్‌లో 11వ హాఫ్ సెంచరీ. ప్రత్యేకంగా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొన్న తీరు మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. బుమ్రా వేసిన తొమ్మిది బంతుల్లోనే కరుణ్ ఏకంగా 26 పరుగులు చేశాడు. దీంతో బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కూడా గుర్తింపు పొందాడు.
ఈ మ్యాచ్‌తో కరుణ్ నాయర్ మరోసారి క్రికెట్ ప్రపంచానికి గుర్తొచ్చాడు. గత జ్ఞాపకాలను రివైండ్ చేస్తూ అభిమానులు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 2016లో ఇంగ్లండ్‌తో టెస్టులో ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా కరుణ్‌కు జట్టులో స్థిరత రాలేదు. ఒక్కసారి ఫెయిల్ అయ్యాడని పక్కన పెట్టేశారు. అయితే తన ప్రతిభతో మళ్లీ బరిలోకి దిగిన కరుణ్... ఇటీవల జరిగిన విజయ్ హజారే టోర్నమెంట్‌లోనూ 779 పరుగులతో అదరగొట్టాడు. 5 సెంచరీలు చేసినా సెలెక్షనర్లకు కనిపించలేదు.
2024 మెగా వేలంలో కేవలం 55 లక్షలకే ఢిల్లీ సొంతం చేసుకుంది. ముంబైతో మ్యాచ్‌లో దొరికిన అవకాశాన్ని రెండు చేతులతో పట్టుకున్నాడు కరుణ్. 12 ఫోర్లు, 5 సిక్సర్లు బాదిన ఈ ఇన్నింగ్స్ అతడి మళ్లీ వచ్చిన ఉత్సాహాన్ని స్పష్టంగా చూపించాయి. ఇప్పుడు ఐపీఎల్‌లో ఈ అద్భుత ఫామ్‌ను గుర్తించి అతడికి టీమిండియాలో మళ్లీ అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ఎంపికలో కరుణ్‌ను పరిగణలోకి తీసుకోవాలన్న డిమాండ్ మళ్లీ జోరందుకుంది.