Jonty Rhodes: ఇప్పటికీ ఆయన ఫీల్డింగ్‌లో అదేజోరు
Jonty Rhodes: సాధారణంగా క్రికెట్ లో బ్యాటింగ్ బాగా చేస్తేనో.. లేదా.. బౌలింగ్ బాగా చేస్తేనో .. ఆ జట్టు విజయాన్ని సాధిస్తుంది. కానీ ఫీల్డింగ్ ద్వారా కూడా అద్భుతమైన విజయాలు సాధించవచ్చునని నిరూపించిన ఓకైక ఆటగాడు దక్షిణాఫ్రికాను చెందిన జాంటీ రోడ్స్
Jonty Rhodes: సాధారణంగా క్రికెట్ లో బ్యాటింగ్ బాగా చేస్తేనో.. లేదా.. బౌలింగ్ బాగా చేస్తేనో .. ఆ జట్టు విజయాన్ని సాధిస్తుంది. కానీ ఫీల్డింగ్ ద్వారా కూడా అద్భుతమైన విజయాలు సాధించవచ్చునని నిరూపించిన ఓకైక ఆటగాడు దక్షిణాఫ్రికాను చెందిన జాంటీ రోడ్స్ . 90 వ దశకంలో క్రికెట్ అభిమానులకు తన డైవ్‌లు, క్యాచ్‌లు, ఫీల్డింగ్ విన్యాసాలతో మరిచిపోలేని జ్ఞాపకాలను అందించిన అధ్భుతమైన ఆటగాడు జాంటీ.
తనలా అద్భుతమైన ఫీల్డర్లు కావాలనుకున్న ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. తనదైన రనౌట్‌లతో ప్రత్యర్థులను వణికించాడు. అడపాదడపా మంచి ఫీల్డర్లు వచ్చిన ఆయన స్థాయిని అందుకున్న ఆటగాళ్లు లేరు. ఇప్పటికి ఆయన ఫీల్డింగ్‌లో ఏ మాత్రం జోరు తగ్గలేదు. ముఖ్యంగా 1992 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ రనౌట్ చేసిన తీరు ప్రత్యేకం. ఇప్పటికి ఆ రనౌట్ అభిమానుల కళ్లల్లో కదలాడుతూనే ఉంటుంది. అది జాంటిరోడ్స్ కెరీర్‌లోనే చిరస్థాయిగా నిలిచిపోయింది.
ప్రస్తుతం ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందిస్తున్న జాంటీ రోడ్స్.. 51 ఏళ్ల వయసులో అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. మెరికల్లాంటి ఫీల్డర్లను తయారు చేసే క్రమంలో తాజాగా వారితో క్యాచ్‌లు పట్టడం, డైవ్‌లు చేయించడం లాంటివి నేర్పిస్తుండగా ఒకానొక సందర్భంలో తాను కూడా క్యాచ్‌లు పట్టడం మొదలుపెట్టాడు. ఆటగాళ్లు బంతులు విసురుతుంటే తన ఫీల్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఇంత వయసులోనూ తనలోని మునుపటి ఫీల్డర్‌ను గుర్తుకు తెచ్చాడు. ఒక బంతి అతడికి కుడి వైపు దూరంగా వెళుతుండగా గాల్లోకి డైవ్ చేస్తూ దాన్ని ఒంటి చేత్తో అందుకున్నాడు. దీంతో తనలో ఇంకా ఆ వేడి తగ్గలేదని నిరూపించాడు. ఈ వీడియోను పంజాబ్ తమ ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
Did you 'catch' that? 😮#SaddaPunjab #Dream11IPL @JontyRhodes8 pic.twitter.com/VmrCnQtgBZ
— Kings XI Punjab (@lionsdenkxip) September 14, 2020