Pink Ball Test: ఇషాంత్ ను సత్కరించిన రాష్ట్రపతి
Pink Ball Test: 100 వ టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హోం మంత్రి అమిత్ షా అభినందించారు.
Pink Ball Test: 100 వ టెస్టు ఆడుతున్న భారత్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హోం మంత్రి అమిత్ షా అభినందించారు. మ్యాచ్ సందర్భంగా హాజరైన వారు మొమెంటోను అందజేసి ఇషాంత్ ను సత్కరించారు. కపిల్ దేవ్ తర్వాత 100వ టెస్టు ఆడుతున్నది ఇషాంత్ మాత్రమే. అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియమైన మొతెరాలో అభిమానుల కేరింతలు మొదలయ్యాయి. భారత్, ఇంగ్లాండ్ ల మధ్య నేటి నుంచి మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల హాడావుడి కొనసాగుతోంది. అయితే, ఈ స్టేడియానికి నరేంద్ర మోడీ స్టేడియమని పేరు పెట్టారు. ఇంతకు ముందు సర్దార్ పటేల్ స్టేడియంగా పిలిచేవారు.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే..నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు మూడో టెస్టు ఆడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆదిలోనే ఇంగ్లాండ్ టీం కి ఎదురు దెబ్బ తగిలింది. త్వరగానే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో మునిగింది. కడపటి వార్తలు అందేసరికి టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే రెండు టీంలకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. భారత్, ఇంగ్లాండ్ చెరో విజయంతో సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచాయి. 13 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ టీం రెండు వికెట్లు కోల్సోయి 41 పరుగులు చేసింది. మూడో ఓవర్లో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన సిబ్లీ స్లిప్‌లో ఉన్న రోహిత్ చేతికి చిక్కి మొదటి వికెట్ గా వెనుదిరిగాడు. అలాగే తన తొలి బంతికే అక్షర్ పటేల్ వికెట్ తీశాడు. బెయిర్ స్టో (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.