Team India: టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు నేడు మొదటి టెస్ట్ మ్యాచ్ లో ప్రత్యర్ధి ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఇప్పటికే మంచి ప్రాక్టీసుతో జట్టు సభ్యులంతా తమ అద్భుత ప్రదర్శనతో టెస్ట్ సిరీస్ ని గెలిచి చరిత్ర తిరగారయాలనే కసితో కోహ్లి సేన ఆరాటపడుతుంది. అయితే గత పది ఏళ్ళలో టీమిండియా జట్టు ఇంగ్లాండ్ వేదికగా 2011లో 0-4తో, 2014లో 1-3, 2018లో 1-4 లో ఒక్క సిరీస్ కూడా గెలవకపోవడం కాస్త నిరాశ పరిచిన ఈసారి ఎలాంటి తప్పిదాలు చేయకుండా టీమిండియా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక టీమిండియా జట్టు ఇప్పటివరకు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ ల జాబితా చూస్తే 1932 లో ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ సిరీస్ లో ఓటమి పాలయిన భారత్ ఆ తరువాత పది ఏళ్ళకి ఒక మ్యాచ్ ని ఇండియాలోని చెన్నై వేదికగా జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ గెలుపొందింది. మరోపక్క ఇంగ్లాండ్ వేదికగా ఇప్పటివరకు భారత్ తో జరిగిన 62 మ్యాచ్ లలో కేవలం ఏడు టెస్ట్ మ్యాచులలో మాత్రమే ఇండియా గెలువగా, 21 మ్యాచ్ లు డ్రాగా ముగియగా ఇంగ్లాండ్ మాత్రం 34 మ్యాచులలో గెలుపొందిన మంచి రికార్డు ఉంది.
ఇటీవలే వరల్డ్ టెస్ట్ సిరీస్ ఛాంపియన్షిప్ ని న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలయి కోల్పోయిన ఇండియా.., ఇప్పటి వరకు కలగానే మిగిలిపోయిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ని గెలిచి చరిత్ర తిరగ రాయాలని కోహ్లి సేనతో పాటు భారత క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు.