IPL 2020: చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు మరో ఎదురు దెబ్బ‌..

IPL 2020: ఐపీఎల్ మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ త‌గిలింది. సీఎస్‌కే జట్టు నుంచి మరో కీలక ఆటగాడు దూరం అయ్యారు. ఇప్పటికే స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా ఇంటి దారి ప‌ట్ట‌గా, తాజాగా సీనియర్ స్పిన్నర్ హర్బన్‌సింగ్ కూడా టోర్నీ నుంచి వైదొలిగాడు.

Update: 2020-09-04 09:27 GMT

Harbhajan Singh Pulls Out Of IPL,

IPL 2020: ఐపీఎల్ మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ త‌గిలింది. సీఎస్‌కే జట్టు నుంచి మరో కీలక ఆటగాడు దూరం అయ్యారు. ఇప్పటికే స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా ఇంటి దారి ప‌ట్ట‌గా, తాజాగా సీనియర్ స్పిన్నర్ హర్బన్‌సింగ్ కూడా టోర్నీ నుంచి వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాడు. తన నిర్ణయాన్ని జట్టు యాజమాన్యానికి తెలియజేశాడు.

భారత్‌ నుంచి యూఏఈ వెళ్లిన చెన్నై టీమ్‌తో పాటు హర్బజన్‌ వెళ్లకపోయినప్పటికీ తర్వాత అక్కడికి వెళ్తాడని భావించారు. కానీ, వ్యక్తిగత కారణాలతోనే భజ్జీ ఇంకా యూఏఈ వెళ్లలేదు. అంతకుముందు చెన్నైలో నిర్వహించిన శిబిరంలో కూడా అతడు పాల్గొనలేదు.

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈలో జరగనుంది. ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్ చేరుకున్నాయి. చెన్నై త‌ప్ప అన్ని జ‌ట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. కానీ, చెన్నై సూపర్ కింగ్ మాత్రం కరోనాతో హోటల్ గదులకే పరితిమయ్యింది. జట్టులోని 13 మంది కరోనా బారినపడ్డారు. దీంతో సీనియర్ ఆటగాడు సురేష్ రైనా వ్యక్తిగత కారణాలు చూపి టోర్నీ నుంచి వైదొలిగాడు. చూస్తుంటే ఈసారి చెన్నై జట్టుకు పరిస్థితులు అంతగా అనుకూలిస్తున్నట్టు కనిపించడం లేదు. 

Tags:    

Similar News