CSK vs GT: యువ సారథుల పోరు.. చెన్నైదే గెలుపంటోన్న రికార్డులు..!
CSK vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ సీజన్ ప్రస్తుతం ఏడవ మ్యాచ్‌కు చేరుకుంది.
CSK vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ సీజన్ ప్రస్తుతం ఏడవ మ్యాచ్‌కు చేరుకుంది. మార్చి 26న జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (CSK vs GT) జట్లు తలపడనున్నాయి. గత సీజన్ ఫైనల్ కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగింది. ఇందులో ఎంఎస్ ధోని నాయకత్వంలో CSK టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. నేడు జరగనున్న ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ ఎం.ఎ. చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటల నుంచి మ్యాచ్ మొదలుకానుంది.
ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తమ తమ ప్రచారాన్ని విజయాలతో ప్రారంభించాయి. ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్‌లో CSK 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. మరోవైపు గుజరాత్ జట్టు 6 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్లు తమ విజయాల పరంపరను కొనసాగించేందుకు ప్రయత్నిస్తాయి. మంగళవారం జరిగే మ్యాచ్‌లో ఈ సీజన్‌లో కెప్టెన్సీ కెరీర్ ప్రారంభించిన రితురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్ రూపంలో ఇద్దరు యువ కెప్టెన్లు బరిలోకి దిగనున్నారు.
ఇరుజట్ల హెడ్ టూ హెడ్ రికార్డులు..
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు జరగ్గా, అందులో గుజరాత్ 3 గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇప్పటి వరకు MA చిదంబరం స్టేడియంలో రెండు జట్ల మధ్య కేవలం 1 మ్యాచ్ మాత్రమే జరిగింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో గెలిచింది.
ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), మహిష్ తీక్షణ, దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ రెహమాన్.
గుజరాత్ టైటాన్స్ జట్టు: శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్.
పిచ్, వాతావరణం:
చెన్నై పిచ్ నిదానంగా ఉంటుంది. స్పిన్‌కు సహాయకరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో మొదట బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం మంచిది. స్కోర్ బోర్డులో 170 పరుగులు వస్తే మంచిది. చెన్నై వాతావరణం స్పష్టంగా ఉంది. వర్షం కురిసే అవకాశం లేదు. మైదానంలో మంచు కూడా కనిపించవచ్చు.