IPL Auction 2024: ఐపీఎల్‌ వేలంలో సరికొత్త రికార్డులు.. రూ. 20.50కోట్లు పలికన ప్యాట్‌ కమిన్స్‌

IPL Auction 2024: కమిన్స్‌ను దక్కించుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌

Update: 2023-12-19 13:14 GMT

IPL Auction 2024: ఐపీఎల్‌ వేలంలో సరికొత్త రికార్డులు.. రూ. 20.50కోట్లు పలికన ప్యాట్‌ కమిన్స్‌

IPL Auction 2024: దుబాయి వేదికగా ఐపీఎల్‌ మినీ వేలంలో సరికొత్త సంచలనాలు నమోదు అవుతున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రూ. 24.75కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఉన్న హయ్యస్ట్‌ ప్రైస్‌ 18.50 కోట్లు కాగా ఆ రికార్డ్‌ను స్టార్క్‌ బద్దలు కొట్టాడు.

ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ను రూ.20.50 కోట్లు రూపాయలకు SRH సొంతం చేసుకుంది. రూ.2కోట్ల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన కమిన్స్‌ను దక్కొంచుకోవడానికి SRH, RCB తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు SRH రూ.20.50కోట్లకు దక్కించుకుంది. గతంలో కమిన్స్‌ కోల్‌కతా తరపున ఆడారు..

IPL వేలంలో న్యూజీలాండ్‌ ఆల్‌రౌండర్‌ డారెల్‌ మిచెల్‌ రికార్డు ధర పలికాడు. రూ.14కోట్లు వెచ్చించి మిచెల్‌ను CSK సొంతం చేసుకుంది. గత సీజన్‌లో మిచెల్‌ అన్‌సోల్డ్‌గా మిగిలాడు. బేస్‌ ప్రైస్‌ పెట్టడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపలేదు. కనీసం రెండో రౌండ్‌లోనూ ఎవరూ పట్టించుకోలేదు. మిచెల్‌ కొంత కాలంగా బౌలింగ్‌, బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపిస్తున్నాడు. వరల్డ్‌ కప్‌లోనూ సెంచరీలతో విరుచుకుపడ్డ మిచెల్‌ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయింది.

రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన 33 ఏళ్ల టీమిండియా పేసర్ హర్షల్ పటేల్‌కు భారీ ధర దక్కింది. రూ.11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. హర్షల్ పటేల్ కోసం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడ్డాయి. చివరికి పంజాబ్ దక్కించుకుంది.రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలం బరిలోకి దిగిన టీమిండియా స్టార్ పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను రూ.4 కోట్లకు చెన్నైసూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా శార్దూల్ కోసం పోటీ పడినప్పటికీ తర్వత తప్పుకుంది.

ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లకు సొంతం చేసుకుంది. గత సీజన్ లో హ్యారీ బ్రూక్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. వెస్టిండీస్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్‌ను రూ.7.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. రూ.6.80 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్‌ను రూ.4.20 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. కాగా ఈ వేలంలోకి క్రిస్ వోక్స్ రూ.2 కోట్ల కనీస ధరతో వచ్చాడు.

రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన గెరాల్డ్ కోయెట్జీని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆ జట్టు రూ.5 కోట్లకు గెరాల్డ్ కోయెట్జీను దక్కించుకుంది.రూ.50 లక్షల బేస్ ధరతో వేలం బరిలోకి దిగిన న్యూజిలాండ్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రను రూ.1.80 కోట్లకు చెన్నైసూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. పంజాబ్, చెన్నై జట్లు రవీంద్ర కోసం పోటీ పడ్డాయి. చివరికి చెన్నై దక్కించుకుంది.

దక్షిణాఫ్రికాకు చెందిన వికెట్ కీపర్ ట్రిస్టాన్ స్టబ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు దక్కించుకుంది. ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆటగాడిని దక్కించుకుంది. శ్రీలంక ఆల్ రౌండర్ వసింద్ హసరంగను రూ.1.50 కోట్ల బేస్ ప్రైజ్ ధరకు కొనుగోలు చేసింది.

Tags:    

Similar News