IPL 2024 Auction: ఈనెల 19న జరగనున్న వేలం.. 77 స్థానాలు..1,166 మంది ప్లేయర్లు

IPL 2024 Auction: 262.95 కోట్ల రూపాయలు ఖర్చ చేయనున్న ఫ్రాంచైజీలు

Update: 2023-12-12 08:16 GMT

IPL 2024 Auction: ఈనెల 19న జరగనున్న వేలం.. 77 స్థానాలు..1,166 మంది ప్లేయర్లు

IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌కు ముందు జరిగే మినీ వేలం దాదాపు మరో వారం తర్వాత జరగనుంది. డిసెంబర్ 19న దుబాయి వేదికగా ఈ వేలం జరగనుంది. మొత్తంగా 1,166 మంది ప్లేయర్లు ఇందుకోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే అందరికన్నా.. టాప్-5 ప్లేయర్లపై ఫ్రాంఛైజీలు దృష్టి సారించాయి. వారి కోసం ఫ్రాంఛైజీలు కనీసం 10 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించే అవకాశం ఉంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2024కు సంబంధించి వేలం మరికొన్ని రోజుల్లో జరగనుంది. డిసెంబర్ 19న దుబాయి వేదికగా జరిగే వేలం కోసం 1,166 మంది ఆటగాళ్లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్లలో 830 మంది ఇండియన్ క్రికెటర్లు. మొత్తంగా 909 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఈ సారి వేలంలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

అన్ని ఫ్రాంఛైజీలు కలిపి మొత్తంగా 262.95 కోట్ల రూపాయలు ఖ‌ర్చు చేయ‌నున్నాయి. అయితే గతేడాది జరిగిన వేలంలో ఇంగ్లాండ్‌కు ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్ రికార్డు ధ‌ర పలికాడు. 18.50 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ అతడిని సొంతం చేసుకుంది.

అయితే ఐపీఎల్‌ ప్రాంఛైజీలలో మొత్తం కలిపి 77 స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 30 స్లాట్స్‌ విదేశీ క్రికెటర్లవే కావడం గమనార్హం. ఈ వేలంలో మిచెల్‌ స్టార్క్‌, ట్రావిస్‌ హెడ్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌, రచిన్‌ రవీంద్ర వంటి స్టార్‌ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. భారత్‌ నుంచి శార్ధూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌ వంటి వారు వేలంలో ఉన్నారు.

Tags:    

Similar News