IPL 2023: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ చెప్పిన ధోనీ.. రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు.. ఇదే చివరి సీజన్ అంటూ..!
Ms Dhoni Retirement: ఐపీఎల్ సీజన్ 2023 ప్రారంభమైనప్పటి నుంచి ఎంఎస్ ధోని భవిష్యత్తుపై ఊహాగానాలు, ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి.
Ms Dhoni Retirement: ఐపీఎల్ సీజన్ 2023 ప్రారంభమైనప్పటి నుంచి ఎంఎస్ ధోని భవిష్యత్తుపై ఊహాగానాలు, ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే ధోనీకి చివరి సీజన్ అవుతుందా? మరో ఏడాది ఆడతాడా? అంటూ పలువురు మాజీ క్రికెటర్లు, నిపుణులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఒకింత టెన్షన్‌గానే ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఆందోళనగా ఉన్నారు. అందుకే ధోనిని మైదానంలో చూసేందుకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ధోనీ ఓ ప్రకటనతో ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాడు.
చెపాక్ స్టేడియంలో శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను సులువుగా ఓడించింది. రవీంద్ర జడేజా అద్భుతమైన బౌలింగ్, డెవాన్ కాన్వాయ్ బలమైన ఇన్నింగ్స్‌తో పాటు ఎంఎస్ ధోని క్యాచ్, స్టంపింగ్, వికెట్ల వెనుక రనౌట్ చేయడం కూడా కలిసొచ్చింది.
కెరీర్ చివరి దశ..
మ్యాచ్ గెలిచిన తర్వాత ధోనీ చెప్పిన మాటలు చెన్నై, ధోనీ అభిమానులకు షాకింగ్ న్యూస్ అందించాయి. దీంతో ఇప్పుడు అందరి మదిలో ఒకటే ప్రశ్న - ఇది ధోనీ చివరి సీజన్ కానుందా? అంటూ మాట్లాడుకుంటున్నారు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో హర్షా భోగ్లేతో ధోనీ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఇది చివరి దశ అని, ఇంతకాలం ఆడినందుకు పూర్తిగా ఆస్వాదించాను. సొంత ప్రేక్షకుల మధ్య ఆడటం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు మాకు చాలా ప్రేమను అందించారు' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సీజన్ తర్వాత మళ్లీ మైదానంలో ఆడలేడనంటూ ధోని మరోసారి సూచించినట్లైంది.
పెరిగిన ప్లేఆఫ్ అవకాశాలు..
హైదరాబాద్‌పై తన బౌలింగ్ నిర్ణయంపై ధోనీ పెద్దగా సంతోషించలేదు. ఈ విషయంపై మాట్లాడుతూ, "బ్యాటింగ్ చేయడానికి పెద్దగా అవకాశం రాలేదు. కానీ, ఫిర్యాదులు లేవు. ఇక్కడ నేను మొదట ఫీల్డింగ్ చేయడానికి సంకోచించాను. ఎందుకంటే ఎక్కువ మంచు ఉండదు. మా స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారు. ఫాస్ట్ బౌలర్లు, ముఖ్యంగా పతిరానా కూడా బాగా బౌలింగ్ చేశారు' అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్‌లో CSK 6 మ్యాచ్‌లలో నాలుగు గెలిచింది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే, CSK మిగిలిన 8 మ్యాచ్‌లలో నాలుగు గెలవాలి. చెపాక్‌లో ధోనీ సేన రికార్డును చూస్తుంటే ప్లేఆఫ్‌కు చేరుకోవడం కష్టమేమీ కాదనిపిస్తోంది.