DC vs SRH: ఢిల్లీతో ఈసారైనా సన్ రైజ్ అయ్యేనా..
IPL 2023: ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో సతమతం అవుతోంది.
IPL 2023: ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో సతమతం అవుతోంది. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇప్పటినుంచైనా మెరుగైన ఆట తీరు కనబర్చాల్సి ఉంది. ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం లో ఢిల్లీ క్యాపిటల్స్ లో మరోసారి తలపడేందుకు సన్ రైజర్స్ రెడీ అయింది. గత వారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో సన్ రైజర్స్ ఓటమి పాలైంది. ఈసారి ఎలాగైనా ఢిల్లీ టీమ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని హైదరాబాద్ టీం చూస్తోంది. అయితే గాయం కారణంగా టోర్నీ నుంచి వాషింగ్టన్ సుందర్ తప్పుకోవడం..అలాగే ఓపెనర్ హ్యారీ బ్రూక్ వరుసగా విఫలం కావడం సన్ రైజర్స్ టీమ్ ను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. ఈ సీజన్ లో మొదటి మూడు మ్యాచుల్లో ఓడి హ్యాట్రిక్ నమోదు చేసింది. దూకుడుగా ఆడే ఓపెనర్లు, పటిష్టమైన మిడిల్ ఆర్డర్, మెరుపులు మెరిపించగల సత్తా ఉన్న టెయిల్ ఎండ్ బ్యాటర్స్ టీ20లో ప్రపంచంలోనే టాప్ బౌలర్లు, అత్యుత్తమ శ్రేణి స్పినర్లు ఇలా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నా టీమ్ మాత్రం అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరుస్తూ విమర్శలను ఎదుర్కొంటోంది. గత సీజన్ లో ముంబై ఇండియన్స్ ను వెంటాడిన దురదృష్టం ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ను పట్టుకుందంటూ క్రికెట్ లవర్స్ కామెంట్ చేస్తున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ సైతం తన ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ధీటైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. నిజానికి ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణంగా విఫలమైంది. ఏడు మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. ఓపెనర్ పృథ్వీ షా పేలవ ప్రదర్శనతో క్రీజులో కంటే పెవిలియన్ లోనే ఎక్కువగా ఉంటున్నాడు. వార్నర్ రాణిస్తున్నా అతడు మరీ ధాటిగా ఆడడం లేదు. మిచెల్ మార్ష్ కూడా తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించడం లేదు. ఇక ఢిల్లీ బౌలర్ల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. ప్రత్యర్థి బ్యాటర్లు బౌలర్లపై ఎదురు దాడి చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ కి బౌలర్లు మారుతున్నా టీమ్ తలరాత మారడం లేదు.
ఐపీఎల్ లో కొనసాగాలంటే అటు ఢిల్లీ ఇటు హైదరాబాద్ ఇప్పటినుంచి ధీటైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. గత వారం తలపడిన ఈ రెండు టీములు మరోసారి పోరాడబోతున్నాయి. ఈసారి ఎలాగైనా ఢిల్లీపై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని సన్ రైజర్స్ భావిస్తుంటే..సన్ రైజర్స్ పై అద్భుతమైన రికార్డు ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్ లో కూడా గెలిచి కాన్ఫిడెన్స్ పెంచుకోవాలని చూస్తోంది. మరి ఎవరిపై ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.
సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిక్ క్లాసెన్, మార్కో జాన్సెన్, అబ్దుల్ సమద్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.